మోడీ అబద్ధం ఆడారా? అమిత్ షా అబద్దం చెబుతున్నారా?

Narendra - Modi - Amit -Shahఈరోజు సాయంత్రం మహబూబ్ నగర్ సభ నుండి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నగారా మోగించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన ఆయన కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన చూసిన తర్వాత టిఆర్ఎస్ అదికారంలోకి వస్తుందని అనుకోవడం లేదని అన్నారు.

[m9ad]

ADVERTISEMENT

మళ్లీ రజాకార్ల పాలనను ప్రజలు కోరుకుంటారా అని ప్రశ్నించారు. మూఢ నమ్మకంతో సచివాలయానికి కెసిఆర్ వెళ్లకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఉస్మానియా,గాందీ ఆస్పత్రులను ప్రపంచ స్థాయి లో అబివృద్ది చేస్తామన్నారని, అది ఏమైందని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటని అన్నారు.

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని మాట తప్పారని ఆయన కెసిఆర్ పై ద్వజమెత్తారు.కెసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని షా వ్యాఖ్యానించారు. ముస్లింలకు రేజర్వేషన్లపై తప్పు పట్టారు. ఇవన్నీ బానే ఉన్నాయి ఇన్ని రకాలుగా ఫెయిల్ అయిన కేసీఆర్ ను మరి ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా ఎందుకు పొగిడినట్టో? మోడీ అబద్ధం ఆడారా? అమిత్ షా అబద్దం చెబుతున్నారా?

ADVERTISEMENT
Latest Stories