‘నా చేతుల్లో ఏమీ లేదు… నాకు ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు మంచి చేసేవాడ్ని’ – ఇది ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ముందు ఎల్.కే.అద్వానీ ఒకానొక సమయంలో వెలిబుచ్చుకున్న ఆవేదన. అవును… ‘నేను మోనార్క్’ని అన్న రీతిలో సాగిస్తున్న మోడీ నియంత పాలనకు ఇప్పటికే దేశ ఆర్ధిక వ్యవస్థతో పాటు దేశ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వచ్చారు. గడిచిన నాలుగేళ్లల్లో ప్రజలకు ఉపయోగకారిగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా లేదంటే… ఏ రీతిలో పాలన సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు.
ప్రజలను పక్కన పెడితే… బిజెపి పెద్ద దిక్కు… వాజ్ పేయి తర్వాత భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడుగా పేరుగాంచిన అద్వానీకి కనీస మర్యాదలు కూడా ప్రధాని మోడీ ఇవ్వలేదని చెప్పడానికి తార్కాణంగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అగర్తలాలో మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కు అభివాదం చేసే క్రమంలో స్టేజ్ పైన అమిత్ షా మరియు రాజ్ నాథ్ సింగ్ లకు నమస్కారం చేసిన మోడీ, పక్కనే ఉన్న అద్వానీ నమస్కారం పెడుతున్నా, పట్టించుకోకుండా ఆ పక్కనే ఉన్న త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ దగ్గరకు వెళ్లి చేతులు అందించారు. మోడీ రాజకీయ నీతికి ఇదొక దర్పణంగా నిలుస్తోందన్న విమర్శలు ఓ రేంజ్ లో వస్తున్నాయి.
మాణిక్ కు అభివాదం చేయడంలో తప్పులేదు గానీ, బిజెపి పార్టీకి పెద్ద దిక్కు, గత బిజెపి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అద్వానీని కావాలనే విస్మరించారని నెటిజన్లు మండిపడుతున్నారు. అయినా ఇలాంటి రాజకీయ వేదికలకు అద్వానీ హాజరవుతూ తన స్థాయిని తాను తగ్గించుకుంటున్నారని కూడా నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మోడీ తీరు ‘అయినోళ్లకు ఆకుల్లో – కానోళ్ళకు కంచాల్లో’ మాదిరిగా ఉందనేది గత నాలుగేళ్ళుగా వినిపిస్తున్న విషయం అయితే, మిత్రపక్షం అయిన టిడిపికి సహకారం అందించే విషయంలోనూ, పార్టీలోని పెద్దలను గౌరవించే విధానంలోనూ ఇదే తీరును పదే పదే నిరూపించుకుంటున్నారు.
#WATCH Agartala: Former Tripura CM Manik Sarkar and PM Narendra Modi meet at swearing ceremony of Biplab Deb and others pic.twitter.com/89QtBYkeVm
— ANI (@ANI) March 9, 2018



