మోడీని ధిక్కరించినందుకు కేసీఆర్ కు మోడీ పనిష్మెంట్!

Narendra Modi - KCRతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఒక కాంగ్రెస్ బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేస్తునట్టు ప్రకటించారు. రాష్ట్రాల అవసరాలు ఢిల్లీలో కూర్చున్న మీకేంతెలుస్తాయి? కేంద్రం విదేశీ సంబంధాలకు, సరిహద్దుల రక్షణకు, జాతీయ రహదారుల నిర్వహణకు మాత్రమే కట్టుబడి ఉండాలని ఆయన కొత్త రాగం అందుకున్నారు.

అయితే ఈ ధిక్కారణ ఢిల్లీ పెద్దలకు నచ్చినట్టుగా లేదు. ఇందుకోసం కేసీఆర్ చేపట్టదలచిన కొత్త సచివాలయ నిర్మాణానికి బ్రేక్ వేసినట్టుగా తెలుస్తుంది. కేంద్ర రక్షణ శాఖ కు చెందిన బైసన్ పోలో మైదానంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కెసిఆర్ భావించారు. అప్పట్లో రక్షణ మంత్రి గా ఉన్న మనో హర్ పరికర్ దానికి కొన్ని షరతులతో ఆమోదం తెలిపారు.

ADVERTISEMENT

అయితే భూమి బదలాయింపు జరగలేదు. అయితే ప్రధాని మీద కేసీఆర్ చేసిన పరుషవ్యాఖ్యలు, తరువాతి ఫ్రంట్ ప్రయత్నాలతో కొత్త రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ నుంచి భూమి బదలాయింపు ఆపేసినట్టు సమాచారం. అయితే ప్రభుత్వవర్గాలు ఇది తాము అనుకున్నదే అని తగిన సమయంలో సమాధానం చెబుతామని అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories