బీజేపీని అక్కున చేర్చుకుంటున్న సాక్షి

Narendra Modi  - YS Jagan  ఒకప్పుడు దివంగత రాజశేఖరరెడ్డి ఖరుడు కట్టిన కాంగ్రెస్ వాది. బీజేపీ అంటే ఒంటి కాలి మీద లేచేవారు. 2014 ముందు సొంత కుంపటి పెట్టుకున్నా జగన్ కూడా బీజేపీని దూరం పెట్టారు. అయితే 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం వచ్చాకా ఇక్కడ వైకాపాకు అధికారం రాకపోవడంతో మొత్తం మారిపోయింది.

ADVERTISEMENT

కేంద్రంతో పెట్టుకుంటే అనవసరమైన ఇబ్బందులు వస్తాయి అనుకున్నారో లేక వాళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది గనుక లోపాయకారిగా పొత్తు పెట్టుకున్నారో తెలీదుగానీ జగన్ బీజేపీని అనడం పూర్తిగా మానేశారు. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర బీజేపీకి ఎప్పుడూ లేనంత కవరేజ్ ఇస్తుంది జగన్ కు చెందిన సాక్షి పత్రిక టీవీ – పత్రిక.

తెలివిగా చంద్రబాబు మీద రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రముఖంగా ప్రసారం చేస్తూ ఆ పార్టీకి కూడా చేతనైన సాయం చేస్తుంది. చంద్రబాబు మీద వ్యతిరేకత పెరిగితే తమకు మంచిదే కదా అనుకుంటున్నారు అయితే బీజేపీ వైకాపా భాయిభాయి అని ప్రజలు అనుకుంటే మొదటికే మోసం రావొచ్చు.

ADVERTISEMENT
Latest Stories