Narendraa Modi Ukraine Tour

ప్రధాని నరేంద్రమోడీ ఆగస్ట్ 23న ఉక్రెయిన్ వెళ్ళి ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. ఉక్రెయిన్ దేశంపై రష్యా 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభించింది. నేటికీ అడపా దడపా ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తూ ప్రధాన నగరాలు, పట్టణాలను దాదాపు నేలమట్టం చేసింది.

Also Read – కేసీఆర్‌ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?

అత్యంత శక్తివంతమైన రష్యా కేవలం వారం పదిరోజులలోనే ఉక్రెయిన్ దేశంపై నియంత్రణ సాధించగలమని గుడ్డి నమ్మకంతో యుద్ధం మొదలుపెట్టింది. కానీ అమెరికాతో సహా నాటో దేశాలు ఆయుధాలు, నిధులు, ఆహారం, మందులు వగైరా అందిస్తూ సహాయపడుడుతుండటంతో ఉక్రెయిన్ కూడా రష్యాని ధీటుగా ఎదుర్కుంటోంది. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ అహం దెబ్బ తీస్తోంది. కనుక ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు.

యూరోపియన్ దేశాలపై ఈ యుద్ధ ప్రభావం ఎక్కువగా పడుతోంది. అయినప్పటికీ రష్యా చేత యుద్ధ విరమణకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అవడంతో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ ఇటీవల రష్యా వెళ్ళి పుతిన్‌తో భేటీ అయ్యారు.

Also Read – నువ్వు విష్ణువైతే.. నేను గంటా!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు అగ్ర రాజ్యాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పలుదేశాలు రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు మానుకున్నప్పుడు, భారత్‌ మాత్రం రష్యా నుంచి తీసుకుంది.

మోడీ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంపై ప్రపంచదేశాలు విమర్శించినప్పటికీ, భారత్‌ అవసరాల దృష్ట్యా మోడీ వెనక్కు తగ్గలేదు. అదే రష్యాతో సత్సంబంధాలను కాపాడిందని చెప్పవచ్చు. అందుకే ప్రధాని మోడీ చొరవ తీసుకొని పుతిన్‌తో మాట్లాడగలిగారని చెప్పవచ్చు. వచ్చే నెలలో ఉక్రెయిన్ వెళ్ళి ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం కానున్నారు.

Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?

బహుశః రెండు దేశాల మద్య రాజీ కుదిర్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో ఎటువంటి సంక్షోభం ఏర్పడినా ఆ ప్రభావం అన్ని దేశాలపై పడుతోంది. రెండున్నర ఏళ్ళుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్దం వలన యూరోపియన్ దేశాలతో పాటు అన్ని దేశాలపై పడుతూనే ఉంది.

కనుక ప్రధాని మోడీ ప్రయత్నాలు ఫలించి యుద్ధ విరమణ జరిగితే ఆయన పేరు, భారత్‌ పేరు ప్రపంచదేశాలలో మారుమ్రోగిపోవడం ఖాయం.