సినీ సెలబ్రిటీలు అప్పుడప్పుడు చేసే పొరపాట్ల వల్ల నవ్వుల పాలు అవుతారు. వెనకా ముందు ఆలోచించకుండా చేసే కామెంట్లు కావచ్చు లేదంటే పోస్టులు కావచ్చు విమర్శలకు దారి తీస్తుంటాయి. అయితే ఇప్పుడు సినీ యాక్టర్ నరేష్ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. గతంలో కూడా ఆయన చాలాసార్లు అనవసర కామెంట్లు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టు తోటే మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.
సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఆయన తిరుపతికి వెళ్లానని.. అయితే నైక్ ఎయిర్ షూస్ కోసం తిరుపతి మొత్తం గంటలో తిరిగానని, ఎక్కడా దొరకట్లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక వాటి కోసం ఇక్కడ వెతకడం కంటే హైదరాబాద్ వెళ్లి వెతకడం బెటర్ అంటూ రాసుకొచ్చారు. తిరుపతిలో నాకు కావాల్సినవి దొరకట్లేదు అంటూ సెటైరికల్ గా ఆయన ట్వీట్ చేశారు అన్నమాట.
ఇక ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఆయనను ఏకిపారేస్తున్నారు. ఏంటి మీరు తిరుపతి మొత్తం గంటలో తిరిగారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. తిరుపతి అంటే ఎంత రద్దీగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. నిత్యం వచ్చిపోయే వేలాది భక్తులతో రోడ్లన్నీ కిటకిటలాడుతుంటాయి. అలాంటి రద్దీ రోడ్లమీద ఆయన గంటలో ఎలా తిరిగారబ్బా అంటూ చాలా మంది నెటిజన్లు కౌంటర్ లు వేస్తున్నారు. ఇంకొందరు అయితే.. ఏదో చూపించుకోవడానికి ఇలా చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పైగా ఇంకొందరైతే తిరుపతినీ అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి హైదరాబాద్ అంత డెవలప్ కాలేదని నరేష్ ఇండైరెక్ట్ గా చెబుతున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే గంటలో తిరుపతి మొత్తం తిరిగిన మీరు అది ఎలా సాధ్యపడిందో చెప్పండి అంటూ సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.
గంటలో తిరుపతి మొత్తం తిరిగిన మీరు రెండు గంటలు చెన్నై వెళ్లి కొనుక్కోండి అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇంకొందరైతే ఇలాంటి పోస్టులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు చూసుకోండి అంటూ సూచిస్తున్నారు. మొత్తానికి నరేశ్ ఏదో అనుకుని చేసిన పోస్టు కాస్తా.. ఇలా కౌంటర్లు వేయించుకునే స్థాయికి వచ్చింది.
Roaming about Tirupathi for the last 1 hour for a pair for a pair of nike air shoes. Nope. No where. Have to go back to Hyderabad for them. Hmm strange pic.twitter.com/fyKboJZySA
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 1, 2022



