నాని హీరోగా నటించిన సినిమా ఓటీటీలో రిలీజ్ అయినపుడు జరిగిన రచ్చ తెలియనిది కాదు. కరోనా కారణాలతో నిజంగానే ధియేటర్ లలో రిలీజ్ చేయలేని పక్షంలో నాడు నాని సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అప్పుడు ఎగ్జిబిటర్లు, ధియేటర్ ఓనర్లు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు.
నేడు కరోనా కారణం కాకపోయినా, జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ధియేటర్ ఓనర్లు స్వయంగా మూసేసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో కూడా నాని తన “శ్యామ్ సింగ రాయ్”ని ధియేటర్లలోనే విడుదల చేయబోతున్నాడు, అది కూడా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నలు గుప్పిస్తూ!
ఎస్… సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, రియల్ లైఫ్ లోనూ తనది హీరో లాంటి క్యారెక్టరే అని చాటిచెప్తూ నేడు ఏపీ ప్రభుత్వ చర్యలపై సున్నితంగానే ప్రస్తావించారు. ‘ఒక కిరాణా షాపులో వచ్చే కలెక్షన్ కూడా రాని రీతిలో ధియేటర్ టికెట్లు ఉంటే ఎలా? రాజకీయాలు, సినిమాలు పక్కన పెట్టండి’ అంటూ విజ్ఞప్తి చేసారు.
‘ఇలాంటి చర్యలతో ధియేటర్ కు రావాలనుకున్న ప్రేక్షకులను అవమానిస్తున్నట్లే కదా, ఇలా మాట్లాడితే అసలే రేపు సినిమా రిలీజ్ ఉంది, ఏమవుతుందో.., ఇప్పుడు కరెక్ట్ కాదని’ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పిన నాని మాటలకు సోషల్ మీడియా అంతా ‘హ్యాట్సాఫ్’ చెప్తోంది.
మరి సినిమా ఇండస్ట్రీనే టార్గెట్ గా పెట్టుకున్న వైసీపీ సర్కార్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘మేమింతే’ అని బదులిచ్చింది. ‘ టికెట్ ధరలను నియంత్రిస్తే అవమానించడమా? మేమింతే, ఎంత అంటే అంత వసూలు చేస్తామంటే కుదరదు, సామాన్యులకు అందుబాటులో ఉండాలి, అందుకే తగ్గించాం’ అంటూ మంత్రి బొత్స తెలిపారు.
ఇదిలా ఉంటే జాయింట్ కలెక్టర్లు మరియు లైసెన్సింగ్ ఆథారిటీస్ స్వయంగా ధియేటర్లకు వెళ్లి అన్ని నిబంధనలు సరిగా ఉన్నాయో లేవో చెక్ చేసి ఈ నెల 29వ తేదీ లోపున ఓ నిస్పక్షపాత నివేదిక ఇవ్వాల్సిందిగా, ఇది ‘మోస్ట్ అర్జెంట్’ పనిగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది.
టార్గెట్ టాలీవుడ్ గా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు ఎటువైపుకు దారి తీస్తాయో గానీ, ఇప్పటికే రెండు సార్లు నాని తన గళాన్ని విప్పగా, ‘పుట్టినరోజు శుభాకాంక్షలు’ చెప్పడంలో ‘క్యూ’ కట్టే టాప్ స్టార్ హీరోలందరూ ఇప్పుడు గమ్మున కూర్చోవడం అభిమానులకే నచ్చడం లేదు.
https://twitter.com/venkyreviews/status/1473902128896872451
టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా? మేమింతే, ఎంత అంటే అంత వసూలు చేస్తామంటే కుదరదు.. సినిమా సామాన్యులకు అందుబాటులో ఉండాలి, అందుకే ధరలు తగ్గించాం-మంత్రి బొత్స#AndhraPradesh #Tollywood #MovieTickets #Nani #BotsaSatyanarayana
— NTV Breaking News (@NTVJustIn) December 23, 2021



