Nirmala Sitharaman Introduced Union Budget 2025

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన 8 వ వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టి వరుసగా అత్యధిక సార్లు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా సరికొత్త రికార్డు సాధించారు.

ఈసారి నిర్మల ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ మీద అటు ఉద్యోగులే కాదు ఇన్వెస్టర్లు కూడా గంపెడాశలతో ఎదురుచూసారు. అయితే ఇందులో ఉద్యోగుల ఆకాంక్షకు తగ్గట్టుగా 12 లక్షల వరకు పన్ను రాయితీ కల్పించిన నిర్మల ఇన్వెస్టర్ల ఆశకు మాత్రం మరోసారి గండికొట్టారు.

Also Read – చంద్రబాబు నాయుడు విధానాలే కరెక్ట్?

దీనితో అప్పటి వరకు లాభాల పట్టిన స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఎరుపెక్కాయి. ముఖ్యంగా డిఫెన్సె, రైల్వే సెక్టర్స్ మీద ఈ బడ్జెట్ లో అయినా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తారు, అందుకు అనుగుణంగా రంగానికి సంబంధించి నిర్మల మంచి వార్త అందిస్తారు అనుకున్న షేర్ హోల్డర్స్ కి మరోసారి నిరాశే ఎదురవ్వడంతో ఆ శాఖలకు సంబంధించిన స్టాక్స్ నష్టాలబాటపట్టాయి.

గత పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా ఇదే మాదిరి నిర్మల బడ్జెట్ ప్రభావం దేశీయ మార్కెట్లను పతనం దిశగా తీసుకెళ్లాయి. దీనితో కనీసం ఈసారైనా తమ కష్టాలు తీరతాయి అనుకున్న స్టాక్ హోల్డర్స్ నిర్మల పొద్దు మాకు మేలు చేకూరాలి అంటూ నిర్మల సీతారామన్ ఫొటోకు పూజలు చేస్తూ మము కరుణించమ్మ, కాపాడమ్మా అంటూ రీల్స్ చేసిన వైనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read – దెబ్బలు పడతాయ్ రాజా..

అయితే ఇన్వెస్టర్ల పూజలు, స్టాక్ హోలీడర్ల హారతులు ఏమి ఫలితాలనివ్వలేదు అనేది నిర్మల గారు పొద్దు మొదలు పెట్టిన కొద్దిసేపటికే దేశీయ మార్కెట్లు గ్రహించడం, తద్వారా నిఫ్ట్య్ బులిష్ నుంచి బేరిష్ వైపు దూసుకెళ్లడం గమనించవచ్చు. బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వివిధ రంగాల సంస్థలకు కూడా ఈ బడ్జెట్ ఊతాన్నివ్వకపోవడంతో ఆయా రంగాల సంస్థల స్టాక్స్ పతనం దిశగా పయనిస్తున్నాయి.




గత కొద్దీ కాలంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న భారతీయ స్టాక్ మార్కెట్ ఈ బడ్జెట్ తో ఆ గండం నుంచి బయట పడుతుంది, ఈ పెద్దమ్మ పడేస్తుంది అని ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లకు పెద్దమ్మ పేద గుదిబందం వేసింది అంటున్నారు ట్రేడర్స్.

Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?