Donald Trump

రెండవసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత ట్రంప్ ఆలోచన ధోరణి పూర్తిగా నియంతలా మారిపోయిందా అన్నట్టుగా ట్రంప్ ప్రకటనలు ఉంటున్నాయి. ఎప్పటి నుంచో భారత్ – అమెరికా దేశాల మధ్య మంచి స్నేహ పూర్వకమైన సంబంధాలు కొనసాగుతున్నాయి.

కానీ ఈసారి ట్రంప్ దూకుడు చూస్తుంటే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బీటలు మారే ప్రమాదం ఉందా అనిపిస్తుంది. అగ్ర రాజ్య అధ్యక్షుడిగా అమెరికా ప్రెసిడెంట్ పదవిని అధిరోహించిన నాటి నుంచి నేటి వరకు ట్రంప్ ఎదో విధంగా భారతీయులను అవమానిస్తూనే వస్తున్నారు.

Also Read – తల్లిపై కేసు.. తల్లికి వందనంతో మరో కేసు!

ముందుగా అమెరికాలో అనధికారికంగా ఉంటున్న భారతీయులందరిని ముఖాలకు ముసుకులేసి, కాళ్లకు సంకెళ్లు వేసి ఎదో యుద్ధ ఖైదీలను బంధించిన మాదిరి తెచ్చి భారత్ లో విడిచి పెట్టారు. అయితే ఇందులో వారిది కూడా కొంత మేరకు తప్పిదం ఉంది కాబట్టి సరిపెట్టుకున్న భారత ప్రభుత్వం మిగిలిన విషయాలలో కూడా నిశ్శబ్దాన్ని పాటించడం విమర్శలకు తావిస్తుంది.

పెహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాక్ ఉగ్రవాదం పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో అటు ప్రపంచ దేశాలు భారత సైన్యం సత్తా గురించి చర్చించుకుంటున్న సమయంలో ‘సీజ్ ఫెయిర్’ అంటూ అగ్రరాజ్య అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచి ప్రకటన రావడం భారతీయతులందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Also Read – తొలి అడుగు చాలా అవసరమే!

భారత్ – పాక్ మధ్య యుద్దాన్ని నేనే మధ్యవర్తిత్వం చేసి ఆపేసాను, అణుబాంబు దాడి నుంచి ఎన్నో వేలమంది ప్రాణాలను కాపాడాను, భారత్ – పాక్ సీజ్ ఫెయిర్ కు ఒప్పుకోకుంటే రెండు దేశాలతోనూ వాణిజ్య వ్యాపారాలు ఆపేస్తాను అంటూ బెదిరించాను అంటూ ట్రంప్ ఇష్టానురీతిగా రెచ్చిపోతున్నా భారత్ అందుకు ధీటుగా అగ్రరాజ్య అధ్యక్షుడికి కౌంటర్ వేయలేక ప్రత్యర్థి పార్టీల నుండి విమర్శలను మూటకట్టుకుంది.

ఆ తరువాత ట్రంప్ చేసిన ప్రకటలను భారత్ ప్రభుత్వం ఖండించినప్పటికీ బీజేపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక తాజాగా భారత్ లో ఆపిల్ సంస్థ పెట్టుబడుల విషయంలో కూడా ట్రంప్ ఇదే మాదిరి బహిరంగ బెదిరింపులకు దిగుతున్నారు.

Also Read – జైల్లో సౌకర్యాలు లేవు… ఇలా అయితే ఎలా?

ఆపిల్ సంస్థ అధిపతులను భారత్ లో పెట్టుబడులు పెట్టవద్దు అంటూ ట్రంప్ బహిరంగ హెచ్చరికలు చేస్తున్నారు. అయినా కూడా భారత్ ట్రంప్ ప్రకటనల పై స్పందించలేకపోతుంది.

మూడు సార్లు భారత ప్రధానిగా ఎన్నికైన మోడీ దేశ విదేశాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సృష్టించుకున్నారు. అలాగే భారత్ కు కూడా ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను సృష్టించారు. ఇటువంటి సమయంలో భారత్ లోకి ప్రముఖ సంస్థలను పెట్టుబడులు పెట్టనివ్వకుండా ట్రంప్ బెదిరిస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుంది అంటూ కాంగ్రెస్ మోడీ పై మండిపడుతుంది.




ట్రంప్ చేస్తున్న ప్రకటనలు భారతదేశ పారిశ్రామిక రంగానికి తీవ్ర పెనుముప్పుగా మారతాయని, వాటిని ఇప్పుడే భారత్ ప్రభుత్వం ఖండించకపోతే ప్రముఖ సంస్థలమే భారత్ వైపు చూసే పరిస్థితి ఉండదని, ట్రంప్ ప్రకటనలు దేశానికి ఇంత నష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నా బీజేపీ ఎందుకు ట్రంప్ కు కౌంటర్ ఇవ్వలేకపోతుంది.? అమెరికాకు భారత్ బలమైన సమాధానం చెప్పి తీరాలి అంటూ కాంగ్రెస్ నేతలు బీజేపీ పై ఒత్తిడి పెంచుతున్నారు.