నేను ఎన్టీఆర్‌ భార్యని మరిచిపోయారా… నన్ను పిలవరా?

Lakshmi-Parvathiరాజకీయాలలో ఉన్నవారికి వారి పార్టీల ద్వారా ప్రజలలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంటుంది. నటీనటులకు, దర్శకులు, నిర్మాతలకు వారి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంటుంది. అయితే లక్ష్మీ పార్వతికి స్వర్గీయ ఎన్టీఆర్‌ ద్వారానే గుర్తింపు లభించింది. నేటికీ ఆమె ఆ గుర్తింపుతోనే నెట్టుకొచ్చేస్తున్నారు.

అదేమీ తప్పు కాదు. కానీ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్నట్లు, ఎన్టీఆర్‌ పేరు చెప్పుకొంటూ చంద్రబాబు నాయుడుని, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను విమర్శిస్తుండటమే అభ్యంతరకరం. ఆమె వైసీపీలో ఉన్నారు కనుక వైసీపీ నేతగా మాత్రమే మాట్లాడినా సహేతుకంగా ఉండేది. కానీ తాను ‘ఎన్టీఆర్‌ భార్య’ననే విషయం గుర్తుచేస్తూ విమర్శిస్తుంటారు. ‘ఎన్టీఆర్‌ భార్య’గానే ఆమె తన ఉనికిని కాపాడుకొంటున్నారు కనుక ఈ విషయంలో ఎవరేమనుకొన్నా ఆమె పెద్దగా పట్టించుకోరు.

ADVERTISEMENT

అయితే ఆమె తాను ‘ఎన్టీఆర్‌ భార్య’నని అనుకొంటున్నా, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, మీడియా, ప్రజలు, చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా అలా భావిస్తున్నట్లు లేదు. ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 28న రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపదీ ముర్ము ఎన్టీఆర్‌ స్మారకార్దం ఆర్‌బీఐ ప్రత్యేకంగా ముద్రిచిన రూ.100 నాణేలను విడుదల చేస్తున్నారు.

ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను, చంద్రబాబు నాయుడుని కూడా ఆహ్వానించారు. కానీ లక్ష్మీ పార్వతిని ఆహ్వానించలేదు! దీంతో ఆమె వెంటనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖలు వ్రాసి, తాను ఎన్టీఆర్‌ భార్యనని, తనను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని అభ్యర్ధించారు. బహుశః అధికారులు పొరపాటున తన పేరును జాబితాలో చేర్చడం మరిచిపోయి ఉండవచ్చని కనుక తన పేరును ఆహ్వానితుల జాబితాలో చేర్చి తనను ఆహ్వానించాలని లక్ష్మీ పార్వతి కోరారు.

ADVERTISEMENT
Latest Stories