
జగన్ చేసిన 5 ఏళ్ళ ఆర్ధిక విధ్వంసంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలాగూ దెబ్బ తింది. కనుక కొలుకునేందుకు కాస్త అప్పు తెచ్చుకోవాలన్నా ఇక అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందని సాక్షాత్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో చెప్పారు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా రాష్ట్రానికి ఇక ఏమాత్రం అప్పు తీసుకునే శక్తి లేదని, దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఈ దుస్థితికి దిగజారిందని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.
రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం రూ.40,635 కోట్లు కాగా రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్యలోటు రూ.79,926 కోట్లని అంచనా వేశారు.
Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?
కానీ ఈ పరిస్థితిలో కూడా రాష్ట్రాభివృద్ధిని, సంక్షేమ పధకాలను విస్మరించలేదు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం తప్పనిసరి.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఇటువంటి దయనీయ పరిస్థితి ఉందంటే అర్దం చేసుకోవచ్చు. కానీ 5 ఏళ్ళ జగన్ విధ్వంస పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఇంత దయనీయంగా మారడం చాలా బాధాకరమే కదా?
Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?
రాష్ట్రానికి ఆదాయం సంవృద్ధిగా ఉండి ఉంటే, బడ్జెట్ కేటాయింపులలో అది స్పష్టంగా కనిపించేది. కానీ జగన్ పుణ్యమాని అప్పులు, వాటి వడ్డీ చెల్లింపులకే వచ్చిన ఆదాయంలో అధిక శాతం కేటాయించవలసి వస్తోంది. కనుక కొన్ని రంగాలకు, సంక్షేమ పధకాలకు కోతలు తప్పలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఎంత అత్యవసరమైనా అప్పు పుట్టని పరిస్థితి కల్పించిన జగన్, అందుకు ఏమాత్రం సిగ్గు పడకపోగా, సంక్షేమ పధకాలకు కోతలు విధించారని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..
ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఓ మెట్టు దిగి బీజేపితో పొత్తుపెట్టుకోవడం వలననే నేడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు లభిస్తున్నాయి. లేకుంటే ఆంధ్రా పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుంది.