మాకు మైలేజ్ రాలేదు కాబట్టి ఆట మళ్ళీ ఆడదాం అన్నట్టు ఉంది జగన్

YS Jagan -No confidence Motion.jpgమోడీ ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది అయినా జయదేవ్ గల్లా, రామ్ మోహన్ నాయుడు పార్లమెంట్ ను గడగడలాడించి రాష్ట్ర సమస్యలు దేశం మొత్తానికి తెలియజేశారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజీనామాలు చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయ్యింది. కీలకమైన తరుణంలో రాష్ట్రం గురించి మాట్లాడే అవకాశం కోల్పోయింది.

ఈ ఆటలో టీడీపీకి బీభత్సమైన మైలేజ్ రాగా, వైకాపా వెనుకపడిపోయింది. అయితే ఈ రోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్లేట్ ఫిరాయించారు. అసలు అవిశ్వాసం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అన్నట్టు మాట్లాడి ఇప్పుడు తాజాగా మొత్తం అందరు ఎంపీలు రాజీనామా చేస్తే ఉపయోగం ఉంటుందని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

టీడీపీ ఎంపీలంతా రాజీనామాలు చేసి నిరాహార దీక్షలకు కూర్చోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అందరు ఎంపీలు రాజీనామాలు చేసి పోరాటం చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదన్నారు. ఎంపీలు అందరూ రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తాదని తెలిసే చంద్రబాబు రాజీనామాలు చేయించలేదని మరో విచిత్రమైన ఆరోపణ కూడా చేసేశారు.

అంటే ఇప్పుడు అవిశ్వాసం విషయంలో సరైన మైలేజ్ రాలేదు కాబట్టి ఇంకో ఆట ఆడదాం అన్నట్టుగా ఉంది జగన్ వాదన. ఇప్పుడు ఆటలో టీడీపీ పై చేయ్యి సాధించింది. ఇప్పుడు జగన్ చెప్పినట్టుగా చేసి వైకాపాకు మైలేజ్ ఇవ్వనవసరం చంద్రబాబుకు లేదు. అసలు నిజానికి రాజీనామాలు చేసిన వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అందరికి తెలిసిందే. ఇప్పటికే రాజీనామాలు చేసిన వైకాపా ఎంపీలకు వచ్చిన మైలేజ్ నామమాత్రమే.

ADVERTISEMENT
Latest Stories