వైసీపి ఎమ్మెల్యేలకు ఇక అగ్నిపరీక్షలే

No more ordeals for YCP MLAsదేశంలో 5 ఏళ్లకోసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటాయి. అంటే ఎన్నికలలో గెలిచినవారు 5 ఏళ్ళపాటు రాష్ట్రాన్ని లేదా దేశాన్ని పాలించమని అర్ధం. కనీసం 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని దూరదృష్టితోనే మన రాజ్యాంగ నిర్మాతలు ఈ ఏర్పాటు చేశారు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకి ఇంకా రెండేళ్ళ సమయం ఉండగానే ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టేస్తోంది. అంటే పాలనకు మూడేళ్ళు చాలు…మిగిలిన రెండేళ్ళు ఎన్నికల కోసమని భావిస్తున్నట్లుంది.

ఏపీ సిఎం జగన్ నిన్న మంగళగిరిలో వైసీపి శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతూ “ఎమ్మెల్యేలందరూ ఈ ఉగాది నుంచి తమ నియోజకవర్గాలలో ఇంటింటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ కలిసి ఆశీర్వాదం తీసుకోవాలి. మే నెల నుంచి గడప గడపకు కార్యక్రమం మొదలుపెట్టాలి. బూత్ స్థాయి వరకు పార్టీని పటిష్టం చేసుకోవాలి. వచ్చే ఎన్నికలలో పార్టీ గెలుపే మన లక్ష్యంగా ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలి. మీ పనితీరును బట్టే పార్టీ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కనుక మీ పనితీరు బాగుందని సర్వేలో రిపోర్ట్ వస్తేనే వచ్చే ఎన్నికలలో మీకు టికెట్ లభిస్తుంది లేకుంటే లేదు. రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే రెండున్నరేళ్ల తరువాత పనితీరును బట్టి మంత్రులను మార్చుతానని చెప్పాను. కనుక త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది,” అని చెప్పారు.

ADVERTISEMENT

తమ ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాలు, సంక్షేమ పధకాలతో వైసీపీకి మరో 10-15 ఏళ్ళవరకు తిరుగు ఉండదని గట్టి నమ్మకం కనబరిచేది. ఆ నమ్మకంతోనే ఎంత భారమైనా సంక్షేమ పధకాలు కొనసాగిస్తోంది. తమ సంక్షేమ పధకాలే తమను మళ్ళీ మళ్ళీ గెలిపిస్తాయనే నమ్మకం ఉన్నప్పుడు ఇంకో రెండేళ్ళ తరువాత వచ్చే ఎన్నికలని చూసి ఇప్పుడే ఆందోళన దేనికి?ఇప్పటి నుంచే ఎన్నికల సన్నాహాలు ఎందుకు?అంటే తమ ‘సంక్షేమ సమ్మోహనాస్త్రం’ ప్రజలపై పనిచేస్తోందో లేదో అనే అనుమానామా లేక రాష్ట్రంలో పరిస్థితులు తారుమారు కావచ్చనే అభద్రతాభావమా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

సిఎం జగన్ చెప్పిన దానిని బట్టి ఇంతవరకు తమకు ఎదురేలేదనుకొన్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇక నుంచి ప్రతీరోజూ అగ్నిపరీక్షలు తప్పవని స్పష్టం అయ్యింది. ఒకవైపు మంత్రి పదవులు పోతాయనే భయం. మరోపక్క సర్వే రిపోర్ట్ సరిగ్గా లేకపోతే టికెట్లు దక్కవనే భయం. మరోవైపు సిఎం జగన్ నుంచి ఒత్తిడి. ప్రజల మద్యకు వెళితే సమస్యలపై నిలదీస్తారనే భయం. అధినేతకు అధికారం కోల్పోతామనే అభద్రతాభావం…మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులు టికెట్లు కోల్పోతామనే భయం. ఈ పరిస్థితులలో ఇక రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించే ఆసక్తి, ఓపిక, తీరిక ఎలా

ADVERTISEMENT
Latest Stories