
జగన్ 5 ఏళ్ళ పాలనలో ఓసారి మూడు రాజధానులని మరోసారి విశాఖ రాజధాని అంటూ రకరకాల కధలు చెపుతూ కాలక్షేపం చేసి వెళ్ళిపోయారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు అలాంటి కధలు చెప్పలేదు. ఏ కొండని పిండి చేయడం లేదు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విశాఖలో పర్యటించి నగరాభివృద్ధిపై జిల్లా అధికారులతో చర్చించి, ప్రణాళికలు సిద్దం చేసి పంపించమని ఆదేశించారు.
Also Read – గమనిక: కొడాలి నానిని అరెస్ట్ చేయలేదు!
విశాఖ నగరానికి అతి సమీపంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మద్యన గల భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను వేగవంతం చేశారు. విమానాశ్రయ సౌకర్యాలు కల్పించేందుకు మరో 500 ఎకరాలు కేటాయించారు.
2026 ఏప్రిల్ నాటికల్లా అక్కడి నుంచి విమానసేవాలు మొదలవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని రేయింబవళ్ళు పనులు జరుగుతున్నాయి.
Also Read – భారత్‌కు సుద్దులు చెప్పి ట్రంప్ ఏం చేస్తున్నారిప్పుడు?
ఓ పక్క చకచకా విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతుంటే మరోపక్క దానిని కలుపుతూ 15 ప్రధాన రహదారులు నిర్మిస్తున్నారు. తాజాగా విశాఖ మెట్రో నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు కూడా ముహూర్తం ఖరారు చేసేశారు.
ఈ ఏడాది అక్టోబర్ నుంచి పనులు మొదలుపెట్టి మూడేళ్ళలోగా పూర్తిచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా వాహనాలు, మెట్రో రైళ్ళు ప్రయాణించేలా డబుల్ డెక్కర్ ఎలివేటడ్ మెట్రో కారిడార్ నిర్మించబోతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.
Also Read – జగన్ వార్ డిక్లేర్… ఇవిగో సాక్ష్యాలు!
విశాఖ రాజధాని అయితేనే ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అభివృద్ధి అవుతాయని లేకుంటే కావని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిచ్చి వాదనలు చేస్తుండేవారు.
కానీ విశాఖలో రాజధాని లేకపోయినా, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ఏమేమి అవసరమో నేడు విశాఖలో విఎంఆర్‌డీఏ కార్యాలయంలో మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాస రావు, విఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలు చర్చించారు.
అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కలుపుతూ కొత్తగా నిర్మించాల్సిన రోడ్లు, ఫ్లై ఓవర్లు, అవుటర్ రింగ్ రోడ్, టిడ్కో ఇళ్ళ నిర్మాణాలు, మౌలిక వసతుల అభివృద్ధి గురించి ఈ సమావేశంలో చర్చించారు. వీటన్నిటిపై అధికారులు నిర్ధిష్టమైన ప్రతిపాదనలు అందజేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు.