
తెలంగాణ బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరి రాజకీయం వారిదే, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యక్తిగత ప్రాపకం కోసం ఆశ ఆశపడుతున్నారే తప్ప పార్టీ ప్రయోజనం కోసం ఆలోచించే నేతలే కరువయ్యారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన నాడు పార్టీ నేతల మధ్య ఉన్న ఐక్యత నేడు కనుమరుగయ్యింది. ఈటెల రాజకీయం ఈటెలదే, బండి పంచాయితీ బండిదే, కిషన్ పంధా కిషన్ దే అన్నట్టుగా ఎక్కడా కూడా ఉమ్మడి ప్రణాళికలు కానీ ప్రభుత్వం మీద కలిసికట్టు పోరాటాలు కానీ కనిపించడం లేదు.
Also Read – వైసీపీకి టీడీపీ పెర్‌ఫెక్ట్ సమాధానాలు… బావున్నాయి!
కేంద్ర మంత్రులు గా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు టి. బీజేపీ పార్టీ క్యాడర్ కు, లీడర్లకు అంతంత మాత్రంగానే అందుబాటులో ఉంటున్నారు. ఇక బిఆర్ఎస్ నుంచి బీజేపీ గూటికి చేరిన ఈటెల రాజేంద్ర ప్రసాద్ తన వ్యక్తిగత బలంతో, బలగం తో పార్టీలో చక్రం తిప్పడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అయినా కూడా ఈటెల వ్యూహాలు బీజేపీ లో అంతగా సానుకూల ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మరో సీనియర్ మహిళా రాజకీయ నేత డీకే అరుణ తన ప్రాభవాన్ని చూపించడం మీద పెట్టె శ్రద్ద పార్టీ బలోపేతం మీద ఉంచలేకపోతున్నారు.
Also Read – అయ్యో పాపం ఆమాద్మీ… ఇలా కూడానా?
అలాగే తెలంగాణ బీజేపీ వివాదాల నేత రాజా సింగ్ ఒకసారి పార్టీకి వీర విధేయుడిలా మరోసారి పార్టీ వ్యతిరేక విధానంలా తనదైన పంధాలో ముందుకెళ్తుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటడానికి, ప్రతిపక్షానికి సమంగా నిలబడటానికి ఇక్కడ బీజేపీ పార్టీ పై, పార్టీ నేతల పై పట్టున్న నాయకుడు కొరవడ్డాడు.
ఒకరు హైడ్రాకు మద్దతుగా రేవంత్ నిర్ణయాన్ని బలపరిస్తే మరొకరు పేదల ఇళ్ల మీదా మీ పెత్తందారీతనం అంటు ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఒకరు కాంగ్రెస్ పాలన కంటే బిఆర్ఎస్ ప్రభుత్వమే మెరుగు అంటే మరొకరు కేసీఆర్ తో పోలిస్తే రేవంత్ పర్లేదు అంటారు. దేశంలో అగ్ర స్థానంలో ఉన్న బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేపడితే తెలంగాణలో మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ కనీసం స్పష్టత కలిగిన రాజకీయాలు కూడా చేయలేకపోతోంది.
Also Read – చెప్పేవి శ్రీరంగ నీతులు…చేసేవి వైసీపీ రాజకీయాలా.?
బీజేపీ క్యాడర్ తో పాటుగా లీడర్లను కూడా ఏకతాటి మీదకు తీసుకురాగలిగిన సరైన రాజకీయ నాయకుడి తో పాటుగా పార్టీ కోసం శ్రమించే నిజమైన పార్టీ శ్రామికుడు తెలంగాణ బీజేపీ పార్టీ అధినేతగా బాధ్యతలు చేపడితే తప్ప తెలంగాణలో బీజేపీ కలలు కంటున్న స్థానానికి ఎదగలేదు. లేకుంటే ఎప్పటికి బీజేపీ..కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య ఎలక పిల్ల మాదిరి ఉనికి కోసం పోరాడాల్సిందే.
అసలు పార్టీలో ఏకాభిప్రాయమే లేని కాంగ్రెస్ సైతం రేవంత్ నాయకత్వంలో కేసీఆర్ మీద రాజకీయ యుద్ధం చేసి అధికారాన్ని చేపట్టగలిగింది. కేసీఆర్ ని గద్దె దింపగలిగింది. కానీ యావత్ భారతాన్నే ఏకచరాధిపత్యంగా పాలిస్తున్న మోడీ, షా ల బీజేపీ మాత్రం దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తన బలం పెంచుకోలేకపోతుంది. దానికి కారణం ఇక్కడ రాజకీయాల పై బీజేపీ అధిష్టానానికి సరైన స్పష్టత లేకపోవడం, అలాగే సరైన నాయకత్వాన్ని సమకూర్చుకోలేకపోవడమే.