Non-stop YCP Attacks

రెండు నెలల ఎన్నికల ప్రచారానికి తెర దింపుతూ నిన్నటితో ఎన్నికల పోలింగ్ తంతుని ముగించాయి అన్ని రాజకీయ పార్టీలు. అయితే రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందన్న నమ్మకం లేదని ప్రచారం లోనే చేతులెత్తేసిన ఏపీ ఆపధర్మ ముఖ్యమంత్రి తన ప్రభుత్వంలో ఎన్నికలు ఇలానే జరుగుతాయి అని మరోసారి రుజువుచేసుకున్నారు.

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలోను, మున్సిపాలిటీ సంస్థల ఎన్నికలలోను ప్రత్యర్థి పార్టీని భయపెట్టి, బెదిరించి అంతకు లొంగని వారి పై దాడులకు పాల్పడి తమ ప్రభుత్వానికి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల తంతు పూర్తి చేయడం చేతకాదని తేల్చేసారు.

Also Read – జూన్ 4న వైసీపి నేతలు ఎలా ఏర్పాట్లు చేసుకోవాలంటే…

ఇక ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో కూడా అదే ధోరణితో, అదే చేతకాని తనంతో ముందుకెళ్లింది వైసీపీ. అయితే ఈసారి వైసీపీ దాడులకు, బెదిరింపులకు భయపడేది లేదని ఓటర్లు సైతం తమ హక్కు కోసం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి సైతం ఎదురుతిరిగిన దృశ్యాలు నిన్న పోలింగ్ రోజు దర్శనమిచ్చాయి. అలాగే గత ఐదేళ్ళవుగా వైసీపీ అణిచివేతకు గురైన టీడీపీ కార్యకర్తలు కూడా చావో రేవో తేల్చుకోవడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడారు.

పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలు ఎన్నికల సమయంలో కూడా తమ అధికార అహంకారాన్ని చూపించడానికి ప్రయత్నిస్తే వారి అహంకారానికి తమ తెగువతో సరైన సమాధానం చెప్పి టీడీపీ గెలుపు కోసం, పసుపు జెండా విజయం కోసం తమ రక్తాన్ని సైతం చిందించారు. తలలు పగిలినా, నెత్తురు చిందినా గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లారు. ఇందులో మహిళలు సైతం వైసీపీకి తమ పల్నాటి పౌరుషాన్ని రక్తం తో రుచి చూపించారు.

Also Read – ఏం సాధించాలని బొత్స చేత కూడా చెప్పిస్తున్నారంటే…

ఇక పోలింగ్ తంతు ముగిసింది, వైసీపీ దాడులకు ముగింపు పడింది అనుకున్న టీడీపీ నేతలకు ఇంకా యుద్ధం ముగియలేదు అంటూ కవ్విస్తున్నారు వైసీపీ శ్రేణులు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి నాని పై స్థానిక వైసీపీ నాయకులు దాడులతో తెగబడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ ను సందర్శించడానికి వెళ్లిన నాని పై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసారు. దీనితో నాని కారు పూర్తిగా ధ్వంసం కాగా ఆయన గన్ మాన్ కు తీవ్ర గాయాలయ్యాయి.

తన పై వైసీపీ మూకలు చేసిన దాడికి నిరసనగా నాని రోడ్డు పై బెటాయించి దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తల పై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీని పై స్పందించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలింగ్ ముగిసినప్పటికీ వైసీపీ రౌడీల దాడులకు ముగింపు లేకుండా పోతుంది. పల్నాడు, చంద్రగిరి ఘటనలే అందుకు సాక్ష్యాలు. ఈసీ, పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించాలి అంటూ అధికారులను కోరారు బాబు.

Also Read – ఈ విషయంలో జగన్, కేసీఆర్‌ దొందూ దొందేనా?