అభివృద్ధి అంటే చంద్రబాబు… ఎన్టీపీసీ తొలి ఒప్పందం

ntpc-signs-mou-solar-rooftop-panels-on-govt.-buildings-in-andhra-pradesh

రాజకీయాలలో ఒక్కో నాయకుడు ఒక్కో రకంగా ప్రసిద్ధి చెందుతారు. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవలసివస్తే ముందుగా ఐ‌టి రంగం అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, క్రమశిక్షణతో కూడిన పాలన గుర్తుకు వస్తాయి. అదే జగన్మోహన్‌ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే సంక్షేమ పధకాలు, అప్పులు, అరాచకాలు, రాజకీయ కక్ష సాధింపులే గుర్తు వస్తాయి.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అందరూ ఈసారి కూడబలుక్కున్నట్లు చంద్రబాబు నాయుడుని భారీ మెజార్టీతో గెలిపించి జగన్‌ పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టారు. ఆయన కూడా అలవాటు ప్రకారం పాలన, రాష్ట్రాభివృధ్దిపై దృష్టి పెట్టారు. పాలనలో భాగంగా భ్రష్టుపట్టిన వ్యవస్థల ప్రక్షాళన ఇప్పటికే కొంత పూర్తి చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుకోవడంలో, సరికొత్త ఆలోచనలు చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు ముందుంటారని అందరికీ తెలుసు.

ఉదాహరణకు గతంలో విద్యుత్ తక్కువగా ఖర్చు అయ్యే ఎల్ఈడీ బల్బులు అందుబాటులోకి వచ్చినప్పుడు వాటిని వినియోగించేందుకు చంద్రబాబు నాయుడు స్ట్రీట్ లైట్స్, బహిరంగ ప్రదేశాలలో ఎల్ఈడీ బల్బులు అమర్పింపజేశారు. ప్రజలను కూడా వాటి వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రతీ విద్యుత్ కనెక్షన్ మీద రెండు ఎల్ఈడీ బల్బులు ఒక్కొక్కటీ కేవలం రూ.10కి అందించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈడీ బల్బుల వాడకం పెరిగింది. ఆ మేరకు విద్యుత్ వినియోగం తగ్గి విద్యుత్ బిల్లులు తగ్గడం అందరికీ తెలిసిందే.

చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే మరో కొత్త ఆలోచన చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలనేదే ఆ ఆలోచన.

దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ నెడ్ క్యాప్ ‘ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్’తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఆ సంస్థ 2025లోగారాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తుంది.

వాటి ద్వారా మొత్తం 300 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఏటా రూ.118.27 కోట్లు విద్యుత్ వ్యయం తగ్గుతుంది. ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 300 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి వలన కలిగే వాయు కాలుష్యం కూడా ఆ మేరకు తగ్గుతుంది. ఈ సోలార్ వ్యవస్థలని సక్రమంగా నిర్వహిస్తే 25 ఏళ్ళపాటు ఉచితంగా విద్యుత్ లభిస్తుంటుంది. ఆ లెక్కన 25 ఏళ్ళలో సుమారు రూ.2,957 కోట్లు రాష్ట్రానికి మిగులుతుంది.

ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన, వాటితో విద్యుత్ వినియోగం, ఖర్చు తగ్గించుకొంటూనే, వాయు కాలుష్యం కూడా తగ్గించవచ్చానే ఆలోచన 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన జగన్‌కి కలుగలేదు కానీ సిఎం చంద్రబాబు నాయుడు చేసి చూపిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి, దూరదృష్టి అని అందరూ అంటారు.

ADVERTISEMENT
Latest Stories