జర్మనిలో వివిధ ఉద్యోగాలలో స్థిరపడ్డా తెలుగువాళ్ళు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జయప్రధంగా నిర్వహించారు. ప్రపంచం ఉండే తెలుగువాళ్ళు అందరూ మినీ మహానాడులు కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తు ఉంటారు. అయితే ఈ సంవత్సరం అన్నా ఎన్టీఆర్ శతజయంతి కావడంతో..జర్మనీ లో తెలుగు వాళ్ళు ఫ్రాంక్ఫర్ట్ నగరంలో నిర్వహించారు, చాలా రాష్ట్రాలనుండి మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నందమూరి తారకరామారావు గారు ఈ వేడుక ద్వారా ఎన్టీఆర్ గొప్పధనాన్ని.. అయన తెలుగు వాళ్లకు చేసిన సేవలను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయన ఆధురోహించిన ఉన్నత స్థానాలు.. అయన సాధించిన గొప్ప విజియాలు ఆయన శత జయంతి సందర్భంగా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రపంచములో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళ ఆత్మభిమానాలు ఎన్టీఆర్ తో ముడిపడి ఉంటాయి అని కొనియాడారు.ఈ వేడుకకు ఇండియా నుండి దూళ్ళిపాళ్ళ నరేంద్ర.. చింతమనేని ప్రభాకర్. జూమ్ ద్వారా పాల్గొన్నారు.. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ..విధేయతకు మారుపేరు ఎంతో ఉన్నతమైన ఆశీయాలతో స్థాపించిన పార్టీ అని వేడుకకు హాజరైన వాళ్ళను ఉద్దేశించి మాట్లాడారు..
2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రావల్సిన ఆవశ్యకతను వివరించారు. NRI టీడీపీ చేసిన సేవకార్యక్రమాలు నేతలు కొనియాడారు, అన్నా క్యాంటీన్ లకు అందించిన సహకారం అదేవిధంగా ఉక్రెన్ వార్ జరిగిన సమయంలో అందించిన ధనుసహాయాన్ని..అలాగే కార్యకర్తలకు ఇచ్చిన సహాయ సహకారాలను అందరికి తెలియజేసారు. 2024 టీడీపీ అధికారంలోకి రావడానికి మా వంతు సపోర్ట్ ఉంటుంది అని..ఈ వేడుకకు హాజరైన NRI లు ప్రతిజ్ఞా చేసారు..వేడుకకు హాజరైన తెలుగు వాళ్లకు చక్కటి తెలుగు భోజనం ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమంలో హరిప్రియ చేసిన కూచిపూడి నృత్యం, శాన్వి తన మిత్ర బృందం తో పాడిన తెలుగు పాటలు అందర్నీ అలరించాయి. ఈ వేడుక అద్భుతంగా నిర్వహించిన మినీ మహానాడు కమిటీ (అఖిల్, సాయి గాపాల్, రాంబాబు) మరియు టీడీపీ జర్మనీ కమిటీ (పవన్, సుమంత్, శివ, నరేష్, వెంకట్, తిట్టు, అనిల్, వంశి, నీలిమ), మరియు తెలుగు దేశం, నందమూరి తారక రామారావు గారి అభిమానులకి కృతజ్ఞలు తెలుపుతూ సభని ముగించారు.



