‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ సక్సెస్ లతో మంచి ఊపు మీదున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, తదుపరి చిత్రం ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తనకు ‘టెంపర్’ ఇచ్చిన పూరీతో తారక్ జతకట్టబోతున్నాడని ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ, ఏది అధికారికంగా వెల్లడికాలేదు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ వార్త ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న “ఇజం” సినిమాలో తారక్ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నారన్న టాక్ ఊపందుకుంది. కధకు అనుగుణంగా ఓ అతిథి పాత్ర ఉండడంతో, తారక్ ను సంప్రదించిన చిత్ర యూనిట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది ఈ వార్త సారాంశం. దర్శకుడు పూరీతో ఉన్న సాన్నిహిత్యం మరియు తన సోదరుడు సినిమా కావడం వలనే దీనికి అంగీకారం తెలిపారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.



