పిక్ టాక్ : వస్తున్నా… బీ రెడీ ఫ్యాన్స్..!

NTR Janatha Garage,NTR Janatha Garage Stills,NTR Janatha Garage New Stills, NTR Janatha Garage Posters, NTR Janatha Garage New Photos, Janatha Garage Imageయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” సినిమా ఆడియో ఇటీవల విడుదలై సంగీత, సాహిత్య ప్రియులను అలరిస్తోంది. ‘జయహో జనతా’ పాట హైలైట్ గా సాగిన ఈ ఆల్బమ్, ప్రస్తుతం చార్ట్ బస్టర్స్ లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ – కాజల్ అగర్వాల్ పై ‘పక్కా లోకల్’ అనే స్పెషల్ సాంగ్ ను ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరణ జరుపుతున్నారు.

చిత్ర యూనిట్ షూటింగ్ విశేషాలు ఇలా ఉంటే, మరోవైపు సోషల్ మీడియాలో ‘జనతా గ్యారేజ్’ ఫోటోల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా యంగ్ టైగర్ ఎన్ ఫీల్డ్ పై కూర్చుని ఉన్న ఫోటో అభిమానులను విశేషంగా అలరిస్తోంది. అన్ని రికార్డులను సెట్ చేయడానికి సెప్టెంబర్ 2వ తేదీన వస్తున్నాను… సిద్ధంగా ఉండండి అభిమానులు… అంటూ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చే విధంగా ఉన్న ఈ ఫోటో అదిరిపోయేలా ఉంది.

ADVERTISEMENT

ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడడంతో ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ అందుకునే చిత్రంగా నిలవడం ఖాయంగా మారిన తరుణంలో… ఇలాంటి ఫోటోలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతున్నాయి. ఆడియో వేడుకపై సినిమా యూనిట్ అంతా ‘బ్లాక్ బస్టర్’ అన్న ఒకే ఒక్క మాట చెప్పడంతో, జూనియర్ అభిమానులంతా “జనతా గ్యారేజ్” ఫలితంపై ఎంతో ఆశతో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories