పన్నీర్ సెల్వంకు భారీ షాక్… శశికళకే సిఎం అవకాశం..?

O Panneerselvam Vs Sasikala Natarajan Tamil Nadu CMగోల్డెన్ బే రిసార్ట్ వేదికగా జరుగుతున్న తమిళనాడు రాజకీయం సరికొత్త మలుపులు తిరుగుతోంది. సోషల్ మీడియాలో, ఆన్ లైన్ ఓటింగ్ లో ప్రజలంతా పన్నీర్ సెల్వంకు మద్దతు పలుకుతున్నప్పటికీ, కావాల్సిన సంఖ్యా బలం మాత్రం శశికళ వైపే ఉన్నట్లుగా తాజా సమాచారం. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శశికళ ఉత్సాహం చూపుతున్నారన్న విషయం తాజా నివేదికలో బయటకు వచ్చింది. గోల్డెన్ బే రిసార్ట్ లో ఎమ్మెల్యేలను దాచిపెట్టి, బెదిరింపు రాజకీయాలను శశికళ చేస్తోందన్న ఆరోపణలపై పోలీసు వర్గాలు ఓ నివేదికను రూపొందించి మద్రాస్ హైకోర్టుకు సమర్పించారు.

ఈ నివేదిక మొత్తం పన్నీర్ సెల్వంకు భారీ షాక్ ఇచ్చే దిశగా ఉండడం విస్తుగొలిపే విషయం. ఇదిగో 10 మంది వచ్చేస్తున్నారు, అదిగో మరో 15 మంది వచ్చేస్తున్నారు అంటూ పన్నీర్ వర్గం చేస్తోన్న వ్యాఖ్యలన్నీ కేవలం రాజకీయ ఆధిపత్యం కోసమేనని నిరూపించే విధంగా, గోల్డెన్ బే రిసార్ట్ ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు పోలీసు వర్గాలకు సమాచారం అందించడం విశేషం. రిసార్ట్ లో 119 ఎమ్మెల్యేలు ఉన్నారని, వారంతా స్వచ్చందంగానే సదరు రిసార్ట్ లో ఉన్నారని తమకు చెప్పారని, తమపై ఎవరి ఒత్తిడిలు లేవని ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా…. పోలీసులు తయారు చేసిన నివేదికను మద్రాస్ హైకోర్ట్ కు సమర్పించారు.

ADVERTISEMENT

దీంతో పన్నీర్ సెల్వం శిబిరం మీద నీళ్ళు జల్లినట్లయ్యింది. దీంతో తమిళ రాజకీయం మరో మలుపు తిరిగినట్లయ్యింది. ఇప్పటివరకు ఏదొక విధంగా శశికళకు చెక్ పెట్టవచ్చని భావించిన పన్నీర్ సెల్వం వర్గంలో ఆశించినంత సంఖ్యా బలం లేదని తేలిపోయింది. చివరి నిముషం ట్విస్ట్ లు ఏమైనా ఉంటాయోమో ఇప్పుడే చెప్పలేం గానీ, ప్రస్తుతానికి అయితే శశికళకు పూర్తి మెజార్టీ ఉన్నట్లే భావించవచ్చు. ఒకవేళ గవర్నర్ అవకాశం ఇస్తే… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం శశికళకు పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు. అయితే తన వద్దనున్న ఎమ్మెల్యేలు జారిపోకుండా విరామం లేకుండా శశికళ రిసార్ట్ బాట పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories