ఓ కేసు ఇద్దరినీ రోడ్ మీద నిలబెట్టేసిందిగా!

mohan-babu-and-allu-arjun

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నట్లు, ఒక కేసు సెలబ్రెటీలను నడిరోడ్డుపై నిలబెట్టగలదు.. అని మోహన్ బాబు, అల్లు అర్జున్‌ కేసులు చూస్తే అర్దమవుతుంది.

కొన్ని రోజుల క్రితం జల్పల్లి ఫామ్‌హౌస్‌లో మోహన్ బాబు ఆవేశంలో టీవీ9 న్యూస్ ఛానల్ విలేఖరి రంజిత్‌పై దాడి చేశారు. అందుకు పోలీసులు ఆయనపై హత్యయత్నం కింద కేసు నమోదు చేశారు. ఆయన హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ ముందస్తు బెయిల్‌ మంజూరు చేయలేదు. పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది కనుక ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

ఆ కేసు నుంచి బయట పడేందుకు మోహన్ బాబు, మంచు విష్ణు ఆస్పత్రికి వెళ్ళి రంజిత్‌ని కలిసి క్షమాపణలు చెప్పారు కూడా. మనోజ్, విష్ణు ఇద్దరూ కూడా తండ్రి తరపున అతనికి, మీడియాకి క్షమాపణలు చెప్పారు కూడా. కానీ అతను కేసు ఉపసంహరించుకోకపోవడంతో తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులలో ఒకరైన మోహన్ బాబు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు.

సంధ్య థియేటర్‌ ఘటనని అల్లు అర్జున్‌, కుటుంబ సభ్యులు మొదట లైట్ తీసుకున్నారు కనుకనే రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించి బయటపడవచ్చని భావించి ఉండొచ్చు. కానీ అనూహ్యంగా సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోగా, అల్లు అర్జున్‌ ఆయనకి కూడా కౌంటర్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయారు.

కనుక అల్లు అర్జున్‌ కూడా ఈ కేసు నుంచి బయటపడేందుకు రేవతి భర్త భాస్కర్‌తో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన తరపున దిల్‌రాజు వెళ్ళి మాట్లాడాక కేసు వెనక్కు తీసుకుంటానని భాస్కర్ చెప్పారు.

అయితే అల్లు అర్జున్‌ ప్రకటించిన రూ.25 లక్షలకు బదులు కోటి రూపాయలు, సుకుమార్ తరపున 50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ తరపున మరో 50 లక్షలు కలిపి రెండు కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. దిల్‌రాజు, అల్లు అరవింద్ ఇద్దరూ కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్ళి ఆ చెక్కులు భాస్కర్‌కి అందించారు.

ఈ కేసులో నుంచి అల్లు అర్జున్‌ బయటపడటం చాలా ముఖ్యం. భాస్కర్ సహకరించకపోతే సాధ్యం కాదు కనుకనే ఇంత సొమ్ము చెల్లిస్తున్నారని చెప్పొచ్చు లేకుంటే పాతిక లక్షలతోనే సరిపెట్టేసేవారే కదా?

అల్లు అర్జున్‌ కేసు రేవతి కుటుంబానికే పరిమితం కాలేదు. ప్రెస్‌మీట్‌ కారణంగా యావత్ సినీ పరిశ్రమపై ప్రభావం పడింది.

సరిగ్గా ఇటువంటి సమయంలో దిల్‌రాజు టీఎఫ్‌డీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియామితులవడం సినీ పరిశ్రమకు బాగా కలిసి వచ్చింది.

ఆయన సినీ ప్రముఖులతో కలిసి రేపు సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. కనుక ఇక్కడితో ఈ కేసు ముగిసిపోవచ్చు. పనిలో పనిగా మోహన్ బాబు కేసు విషయంలో కూడా దిల్‌రాజు తోడ్పడితే బాగుంటుంది.

ADVERTISEMENT
Latest Stories