టీమిండియా రికార్డును బద్దలుకొట్టిన దక్షిణాఫ్రికా!

One Day Cricket Scores Record by South Africaటెస్ట్, వన్డే, టీ20 అన్న తేడా లేకుండా దూసుకుపోతున్న టీమిండియాకు వన్డే క్రికెట్ లో ఓ అరుదైన రికార్డు ఉంది. వన్డే ఇంటర్నేషనల్స్ లో 350 అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా టీమిండియా సౌత్ఆఫ్రికాతో పాటు షేర్ చేసుకోగా, తాజాగా సౌత్ఆఫ్రికా జట్టు శ్రీలంకపై కొట్టిన 384 పరుగులతో టీమిండియాను వెనక్కి నెట్టింది. ఇప్పటివరకు టీమిండియా 23 సార్లు 350కి పైగా స్కోర్లు నమోదు చేయగా, తాజాగా శ్రీలంకపై బాదుడుతో దక్షిణాఫ్రికా ఆ సంఖ్యను 24కు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది.

అలాగే 400కు పైగా స్కోర్ ను ఎక్కువ సార్లు నమోదు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు పదిలంగా ఉంది. మొత్తంగా 6 సార్లు 400 పైగా స్కోర్లను నమోదు చేసి వన్డేలలో తమ ప్రభావాన్ని చాటుకోవడంలో సఫారీలు విజయవంతమయ్యారు. సఫారీల తర్వాత 400కు పైగా ఎక్కువ సార్లు నమోదు చేసిన జట్టుగా కూడా టీమిండియానే (5 సార్లు) ఉంది. వన్డేలలో భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్ లుగా టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు నిలుస్తున్నయన్న విషయం ఈ గణాంకాలు చెప్పకనే చెప్తున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories