one-nation-one-election-bjp-big-plan

దేశం మొత్తానికి ఒక్క సారే ఎన్నికలు నిర్వహించి తన ‘వన్ నేషన్..వన్ ఎలక్షన్’ అనే కలను నెరవేర్చుకోవాలని ఆశ పడుతున్న బీజేపీ అందుకు సంబంధించిన అన్ని ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేసింది. ఇక ఆ దిశగా అడుగులు వేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.

Also Read – కన్నప్ప తీయడం కూడా శివలీలే!

అయితే ఇప్పుడు దేశంలో బీజేపీ హవ చూస్తుంటే వన్ నేషన్…వన్ ఎలక్షన్ నినాదం తో పాటుగా దేశం మొత్తం ‘వన్ పార్టీ’ విధానాన్ని కూడా అమలు చేసేలా కనిపిస్తుంది. మూడు రంగుల భారత జెండా కాషాయం తో నిండిందా అన్నట్టుగా ప్రస్తుతం దేశంలో బీజేపీలో భాగమైన ఎన్డీఏ కూటమి19 రాష్ట్రాలలో, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

మొత్తం దేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు గాను 19 రాష్ట్రాలను ఇప్పటికే కైవసం చేసుకున్న బీజేపీ ఇక ఆ మిగిలిన ఆ 8 స్థానాలలో కూడా పాగా వెయ్యగలిగితే ఈ వన్ నేషన్..వన్ ఎలక్షన్…వన్ పార్టీ అనే నినాదం కార్యరూపం దాల్చనుంది. అయితే ఇందులో 3 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇండియా కూటమిలో భాగంగా మరో 5 రాష్ట్రాలను బీజేపీ వసం కాకుండా చేయగలిగారు.

Also Read – కోర్ట్: నాని జడ్జ్ మెంట్ బాగుంది..!

దానికి తోడు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా ఇండియా కూటమి అధికారాన్ని అనుభవిస్తుంది. అయితే ఇటు దక్షిణాదిన తెలంగాణ, తమిళనాడు వంటి ప్రాంతాలలో కొంచెం కొంచెంగా తన బలం పెంచుకుంటున్న బీజేపీ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ మీద తమ జెండా ఎగరాలనే పట్టుదలతో ఉంది. ఢిల్లీ మాదిరి వెస్ట్ బెంగాల్ లో కూడా బీజేపీ తమ పట్టు సాధిస్తుందా.? పంతం నిలబెట్టుకుంటుందా.? అనేది వేచి చూడాలి.




మోడీ, షాల ఈ అశ్వమేథ యాగానికి తమ వంతు కృషి గా నేడు ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి హాజరయ్యి బీజేపీ గెలుపులో భాగమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే నాడు బీజేపీ మహారాష్ట్ర విజయంలో తనవంతు పాత్ర పోషించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Also Read – తమిళనాడుకి దూరంగా చంద్రబాబు… దగ్గరవుతున్న పవన్!