తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నాడీఎంకే అధికారికంగా ప్రకటించింది. మద్రాస్ యూనివర్సిటీ హాల్ లో శశికళ ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆమెతో పాటు కొందరు మంత్రులతో కూడా గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణం స్వీకారం చేయిస్తారని, గవర్నర్ ఢిల్లీ నుంచి చెన్నైకి రాగానే ఈ విషయమై చర్చించనున్నట్లు అన్నాడీఎంకే తెలిపింది.
అయితే తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, శశికళ కోసం సిఎం పీఠం త్యాగం చేసిన పన్నీర్ సెల్వం కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. శశికళ క్యాబినెట్ లో ఏ పోర్ట్ ఫోలియో ఇస్తారో ప్రస్తుతానికి సమాచారం లేదు గానీ, కీలకమైన పదవిని పన్నీరుకు కట్టపెడతారని తమిళనాట హల్చల్ చేస్తోన్న పొలిటికల్ టాక్. తాజా సమాచారం మేరకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్పే దిశగా శశికళ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. మరో వారం రోజుల పాటు తమిళనాట రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ హాట్ గా హల్చల్ చేసే అవకాశమైతే స్పష్టంగా కనపడుతోంది.
Win Rs.1000 Paytm for closest guess of @Suriya_offl 's #Singam3 Telugu USA Premiere Collections by Wednesday 7 pm IST #M9NewsWin1000 pic.twitter.com/56Mywd856M
— M9News (@M9News) February 6, 2017



