2014లో విడుదలైన “లౌక్యం” తర్వాత సక్సెస్ మాట మరిచిపోయిన హీరో గోపిచంద్, ఈ సారి “పంతం” పట్టి మరీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. చక్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 5వ తేదీన విడుదల కానుండగా, ప్రమోషన్ లో భాగంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. టీజర్ ఆసక్తికరంగా ఉండగా, ట్రైలర్ ఈ ‘పంతం’ను పక్కా కమర్షియల్ బొమ్మగా ప్రజెంట్ చేసింది.
ప్రస్తుతం సమాజంలో ఉన్న వర్తమాన రాజకీయాలను ముడిపెడుతూ… సిస్టంను ప్రశ్నించే యువకుడిగా గోపిచంద్ రెండు వేరియేషన్స్ లో కనిపించాడు. అయితే రెండు షేడ్స్ కూడా ‘గౌతమ్ నంద’ సినిమాలో పోషించిన క్యారెక్టర్లు మాదిరి ఉన్నాయి. అయితే ఇలాంటి మాస్ అండ్ కమర్షియల్ క్యారెక్టర్స్ ను చేయడంలో గోపి దిట్ట, దానినే మరోసారి రుచిచూపించే ప్రయత్నం చేసారు.
ప్రయోగాలకు పెద్దగా ఆస్కారం లేకుండా కేవలం కమర్షియల్ సబ్జెక్ట్ లకే పరిమితం కావడం గోపీచంద్ కు సక్సెస్ ను దూరం చేసింది. ఈ సారి అదే రూట్ ను ఫాలో అవుతూ కమర్షియల్ సబ్జెక్టును చేసిన గోపిని ప్రేక్షకుల ఎలా ఆశీర్వదిస్తారో జూలై 5వ తేదీన తేలిపోనుంది. గోపి కెరీర్ లో 25వ సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకతను కూడా సొంతం చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ కన్నులవిందు చేయనుంది.



