‘ఆధునిక మహాభారతం’ వెనుక ‘పవన్ కళ్యాణ్’

Pawan Kalyan Adhunika Mahabharatham, Pawan Kalyan Adhunika Mahabharatham Book, Pawan Kalyan Adhunika Mahabharatham Sponsorship “ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు… కలలు ఖనిజాలులో చేసిన యువత మన దేశ భవిష్యత్తుకు నావికులు” అన్న ‘మహాకవి శేషేంద్ర’ గారి మాటలు ఆయనంటే అమితంగా ఇష్టపడేలా చేసినాయి. ‘నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?’ అని ఆయన వేసిన ప్రశ్న నాకు ‘మహావాక్యం’ అయింది.

నాకు అత్యంత ప్రీతిపాత్రమయిన ‘ఆధునిక మహాభారతం’ అనే ఈ మహాగ్రంధాన్ని; దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారి కోసం అందుబాటులో ఉండాలన్న నా ఆకాంక్ష ఈ మహాగ్రంధాన్ని యింకోసారి మీ ముందుకు తీసుకొచ్చింది. నాకు అవకాశాన్ని కల్పించిన ‘మహాకవి శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన సాత్యకి గారికి, నాకీ ‘మహాకవి’ని పరిచయం చేసిన నా మిత్రుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ గారికి నా కృతజ్ఞతలు… పవన్ కళ్యాణ్..!

ADVERTISEMENT

ఇవి స్వయంగా పవన్ కళ్యాణ్ రాసిన పదాలు. పుస్తకాలు ఎక్కువగా చదువుతాడని పవన్ కళ్యాణ్ గురించి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే తనకు బాగా నచ్చిన ‘ఆధునిక మహాభారతం’ వంటి పుస్తకాలను రీ ప్రింట్ చేయించడానికి అయిన ఖర్చును స్వయంగా పవన్ కళ్యాణే ఖర్చు పెట్టారన్నది మాత్రం కొత్త విషయమే. గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఆ పుస్తకాన్ని మళ్ళీ ప్రచురణ చేసిన సందర్భంలో పవన్ రాసిన పలుకులు అవి.

ADVERTISEMENT
Latest Stories