గుంటూరులో వైకాపా జనసేన బలప్రదర్శన

Pawan Kalyan -YS Jaganపార్టీ వ్యవస్థాపక దినం సంధర్భంగా ఈ నెల 14న గుంటూరులో జనసేన భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తుంది. దీనిలో భాగంగా జనసమీకరణ ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో జరుపుతున్నారు. నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో భారీ బహిరంగసభ ఏర్పాట్లు చురుకుగ్గా జరుగుతున్నాయి.

మరోవైపు ఈనెల 12న జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకూడా గుంటూరు జిల్లాలోకి ఎంటర్ కాబోతుంది. ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకులు 14న గుంటూరులోనే ఉండటంతో రాజకీయ వేడి పెరగబోతుంది. జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడని నేపథ్యంలో రెండు పార్టీల వారు ఆరోజు తమ బలప్రదర్శనకు దిగబోతున్నాయి.

ADVERTISEMENT

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుండి జనసేన ప్రముఖంగా జనసమీకరణ చేస్తుండగా, వైకాపా పక్కనే ఉన్న నెల్లూరు, కర్నూల్, రాయలసీమ జిల్లాలనుండి మనుషులను తరలించబోతుంది. ఇప్పటికే వైకాపా స్థానిక నాయకులు దీనిగురించి రెండు మూడు సార్లు సమీక్షలు జరిపారు. మరోవైపు జగన్ పాదయాత్ర 1500 కిలోమీటర్ల మార్కుకు చేరువలో ఉంది.

ADVERTISEMENT
Latest Stories