pawan-kalyan-benguluru-tour

అధికారం కోసం రాజకీయాలే తప్ప రాజకీయం కోసం అధికారం కాదు కాకూడదు అని నిరూపిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు బెంగుళూర్ చేరుకున్నారు పవన్.

చిత్తూరు జిల్లా పరిధిలోని పార్వతీపురం మన్యం ప్రాంతంలో ఏనుగులు గుంపుగా ఊళ్ళ మీదకు వచ్చి పంట పొలాలు నాశనం చేస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడానికి కుంగి ఏనుగుల సాయం కోరడానికి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు పవన్ కళ్యాణ్.

Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.

కుంగి జాతి ఏనుగులు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వంతో చర్చలు జరిపి వాటిలో కొన్ని కుంగి ఏనుగులను ఏపీకి సహాయార్థం తరలించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ది రామయ్యను పవన్ కోరనున్నారు.

ఏనుగుల గుంపులను తరమడానికి తిరిగి వాటిని అరణ్యంలోకి పంపడానికి ఈ కుంగి ఏనుగులు సహాయపడతాయి. ఆ ఉద్దేశముతో పవన్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు.

Also Read – వింటేజ్ విరాట్…!

రాష్ట్ర క్షేమం కోసం తగ్గడానికైనా, వదులు కోవడానికైనా, యుద్ధం చేయడానికైనా ఎప్పుడు సిద్దమే అన్నట్టుగా వ్యవహరించిన పవన్ గతంలో కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అంటూ కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించారు.

అయితే ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పర్యాటక, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలతో సఖ్యతగా ఉంటూ సొంత రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి పవన్ చూపిస్తున్న చొరవ హర్షిందగ్గ పరిణామాన్ని చెప్పాలి.

Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!


రాజకీయాలలో పట్టు విడుపులు ఉండాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టాలని అని ఆచరించి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. అధికారం అందిన నాటి నుండి నేటి వరకు నిత్యం తన శాఖల మీద పట్టు పెంచుకోవడానికి, పాలనా పరమైన విషయాల మీద అవగాహన తెచ్చుకోవడానికి తన సినిమాలను కూడా పక్క పెట్టేసారు పవన్.