అన్నీ యాత్రలోనే అబ్బాయ్!

Pawan Kalyan Bus Yatra‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను కలిపే విధంగా ఈ యాత్రకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బహుశా ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం జనసేన నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పవన్ ప్రయాణించడానికి ఓ లగ్జరీ బస్సు కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

గత కొన్ని రోజులుగా పవన్ మౌనం వహించడం వెనుక కారణం కూడా ఈ యాత్రేనని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. శ్రీరెడ్డి ఉదంతం తర్వాత పవన్ మీడియా వర్గాలకు కనిపించింది లేదు. ప్రముఖ ఛానల్స్ ను బ్యాన్ చేయండి అంటూ ట్వీట్లు చేసారు, ఆపై తనకు ఇష్టమైన పుస్తకాలపై సమాచారం ఇస్తున్నారు తప్ప, రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే దీని వెనుక పక్కా స్కెచ్ ఉందన్నది పొలిటికల్ వాదన.

ట్వీట్లలో విమర్శిస్తే… రేపు యాత్రలో కొత్తగా విరుచుకుపడడానికి మ్యాటర్ ఉండదన్న కోణంలో, ప్రస్తుతం జనసేన అధినేత మౌనం వహిస్తున్నారని, ఈ కారణంతోనే రాజకీయ వేదికలపై కంటే కూడా సినీ వేడుకలపై ఎక్కువగా కనిపిస్తున్నారనేది ఓ వాదన. అధికార పక్షంపై చేయదలుచుకున్న ఆరోపణలు, విమర్శలు అన్నీ బస్సు యాత్రలోనే చేసే విధంగా పకడ్బందీగా ప్రణాళిక సిద్ధమైనట్లు టాక్. మరి పవన్ అమ్ముల పొదిలో దాచుకున్న విమర్శనాస్త్రాలు ఏమిటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories