
పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా, పద్నాలుగేళ్ళు ప్రతిపక్ష నేతగా ప్రజా జీవితంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కొని అవమానాలను, అవహేళనలను ఈ ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో చవి చూసారు.
తనని తన కుటుంబాన్ని ఇటు మీడియాలో అటు అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వంలో మంత్రులుగా పని చేస్తున్న నేతలు, వారి ఆదేశాలను అనుసరించి మంచి చెడు ఆలోచించని అధికారులు ఎంతలా కించపరుస్తున్నా, మరెంతల రెచ్చకొట్టినా వాటన్నింటిని తట్టుకుంటూ వెన్ను చూపక తన ప్రయాణం కొనసాగిస్తూనే వచ్చారు బాబు.
Also Read – అయ్యో ‘నానీ’లు ఇలా అయిపోయారే..!
ఆయన అనుభవానికి కానీ వయస్సుకు కానీ కనీస గౌరవం ఇవ్వకుండా బూతులతో, వెటకారాలతో దూషించిన కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ, జోగి రమేష్, తమ్మినేని, విజయ్ సాయి రెడ్డి వంటి వైసీపీ నేతలు కానీ, జగన్ ఆదేశాలను శిరసావహిస్తూ ముందు వెనుక చూడకుండా అడుగు ముందుకేసిన రాష్ట్ర మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మొదలుకుని మాజీ ఈసీ జవహర్ రెడ్డి వరకు మరెందరో అధికారులు వారి హద్దులు మీరు ప్రవర్తించారు.
వయస్సు మీద పడిపోయింది, అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అయిపోయారు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక రాజకీయాలకు రిటైర్ మెంట్ ప్రకటించి ఇంట్లో సేద తీరు అంటూ ఎద్దేవా చేసిన వైసీపీ నాయకులకు 2024 ఎన్నికలలో వారి రాజకీయ జీవితానికి ఐదేళ్లు తాత్కాలిక రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించారు బాబు.
Also Read – మోడీ “లీగల్లీ కన్వర్టర్ బీసీ”..?
“గంజాయి మొక్కేకేం తెలుస్తుంది గంధపు చెక్క సువాసన” అన్నట్టుగా ‘ఒక ప్రిజనరీ నాయకుడికి విజనరీ నాయకుడి విలువ ఎప్పటికి అర్దమవ్వదు’ అని జగన్ ఈ ఐదేళ్లలో నిరూపించారు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ఐదేళ్లుగా సొంత రాష్ట్రంలో బూతులతో అవమానించిన బాబుని ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ లో దేశ ప్రధాని గౌరవిస్తున్నారు.
జగన్ తనకొచ్చిన అధికారంతో రాజధానులను మార్చి, నిర్మాణాలను కూల్చి, ప్రతిపక్ష నాయకులను జైళ్లకు పంపి కక్ష పూరిత పాలన చేసి రాష్ట్ర పరువును దేశ ప్రజల ముందు దిగజారిస్తే బాబు ప్రజలు తనకిచ్చిన అవకాశంతో కేంద్ర ప్రభుత్వానికి బలమైన పునాదిగా మారి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి గొప్పగా మాట్లాడుకునే స్థాయికి తీసుకువచ్చారు.
Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో కూడా వైసీపీ ఎన్నో దారుణాలకు పాల్పడింది. ఆయన కుటుంబంలోకి ఆడవారిని, చిన్న పిల్లలను సైతం రోడ్డుకు లాగింది. విలువలకు తప్ప డబ్బుకు లొంగని పవన్ ను ప్యాకేజీ స్టార్ అంటూ అవహేళన చేసింది. కనీసం వార్డు మెంబెర్ గా కూడా గెలవలేని దత్తపుత్రుడు అంటూ ఈసడింపు మాటలు పేల్చింది.
కట్ చేస్తే 2024 ఎన్నికలలో రాష్ట్రంలో జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయడంలో జనసేన బలమైన పాత్ర పోషించింది. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన కీలక స్థానాలను ఏపీ నుంచి పొందడానికి బీజేపీని టీడీపీ తో కలిపింది పవన్. ఇలా తానూ తగ్గుతూ అటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ, అటు కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించారు పవన్.
ప్రతి శుక్రవారం కోర్ట్ కు హాజరయ్యే బ్యాక్ గ్రౌండ్ జగన్ ది కాగా ప్రతి శుక్రవారాన్ని మంచి సెంటిమెంట్ గా భావించే సినీ బ్యాక్ గ్రౌండ్ పవన్ ది. శుక్రవారం విలువ మంగళవారానికి ఏం తెలుస్తుంది అన్నట్టుగా పవన్ విలువ జగన్ ఎప్పటికి తెలుసుకోలేరు. ఈ ఐదేళ్ల కాలంలో కనీసం పవన్ అనే పేరు కూడా తన నోటి నుంచి రానివ్వకుండా దత్తపుత్రుడు అంటూ పవన్ ను అవమానించిన జగన్ కు చెంపపెట్టులాగా ఉన్నాయి ప్రధాని మోడీ మాటలు.
నేడు ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో పవన్ గురించి ప్రస్తావిస్తూ నరేంద్ర మోడీ పవన్ అంటే తుఫాన్ అంటూ సంబోధించారు. ఇలా బాబు, పవన్ లకు 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల ముందు ఎదురైనా అవమానాలకు ప్రధాని సాక్షిగా నేడు దేశ ప్రజల ముందు సత్కారం దక్కినట్టయ్యింది.