నిజమే పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు కూడా గట్టు మీద నిలబడి రాళ్లేస్తే పోలా

JAC---Jana-Sena-Pawan-Kalyanపవన్ కళ్యాణ్ వేసిన నిజనిర్ధారణ కమిటీ తన నివేదిక ఇచ్చింది. రాష్ట్రం చెబుతున్నట్టుగానే కేంద్రం దాదాపుగా లెక్కించదగిన వాటిలోనే 75000 కోట్ల మేర భాకీ ఉన్నట్టు తేల్చింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కువగా రాష్ట్రప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కు పెట్టారు. బహుశా జనసేన భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం అయ్యుండ వచ్చు.

ఈ సంధర్భంగా పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ “పోలవరం ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? కేంద్రం నే కట్టనివ్వాల్సింది. వాళ్ళు కట్టకపోతే మీకు గట్టిగా అడిగే హక్కు ఉండేది. ఇప్పుడు వాళ్ళ చేత ప్రశ్నించబడుతున్నారు. రేపు ఏమన్నా జరిగితే మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది.” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ADVERTISEMENT

నిజమే కేవలం రాజకీయ అవసరాల కోసం గట్టు మీద నిలబడి రాళ్లేస్తే పోలా అనుకుంటే చంద్రబాబు అలంటి సాహసం చేసి ఉండేవారు కాదు. ఇప్పటికే భూమి అప్పజెప్పి విద్య సంస్థలు కట్టమని అడిగితే వారు ఏం చేస్తున్నారు మనమంతా చూస్తున్నాం. పోలవరం కట్టడానికి ఎలాంటి కాలపరిమితి లేదు అని సోము వీర్రాజు లాంటి వారి మాటల బట్టి కేంద్రానికి ప్రాజెక్టు ఇస్తే ఏమవుతుందో మనకి తేలికగా అర్ధం అవుతుంది.

ఇంత చిన్న విషయం పవన్ కళ్యాణ్ కు ఎందుకు అర్ధం కాలేదో మరి. అలానే రాష్ట్రం కడితేనే ప్రాజెక్టు త్వరగా పూర్తి అవుతుందని నీతి ఆయోగ్ కూడా అభిప్రాయ పడింది. దాని కోసమే రాష్ట్రానికి ఆ అవకాశం ఇచ్చారు. కేవలం రాజకీయ అవసరాలకు ప్రశ్నించే హక్కు వస్తుందని ఆంధ్రప్రదేశ్ కు జీవాధార వంటి ప్రాజెక్టును వదిలేస్తే చరిత్ర క్షమిస్తుందా?

ADVERTISEMENT
Latest Stories