తనవారికి క్లారిటీ…ప్రత్యర్థి వర్గానికి హెచ్చరిక..! భీమవరం నాదే…!

Pawan Kalyan

టీడీపీ తో జనసేన పొత్తు కుదిరిన నాటి నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం పై భిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. పవన్ భీమవరం నుండి అంటూ కొందరు…లేదు లేదు పిఠాపురం నుండి అంటూ కొందరు…లేదు పవన్ ఈసారి ఎమ్మెల్యే గా కాదు ఎంపీ గా కాకినాడ నుండి పోటీ చేయబోతున్నారు అంటూ…కాకినాడ కాదు అనకాపల్లి నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు అంటూ ఇలా రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి.

వీటితో అసలు పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనే మీమాసంలోకి వెళ్లిపోయారు ఆయన అభిమానులు, పార్టీ క్యాడర్, అలాగే వైసీపీ నాయకత్వం. అయితే వీరందరి అనుమానాలకు ఈరోజు తెర దింపారు పవన్ కళ్యాణ్. ‘ఈసారి భీమవరం నాదే’…అంటూ తన జనసైనికులకు ఒక క్లారిటీ…తన ప్రత్యర్థి వర్గానికి ఒక హెచ్చరిక పంపారు పవన్. అలాగే పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓటించాలనే గట్టిపట్టుదలతో దాని కోసం ఎన్ని కోట్ల ఖర్చు చేయడానికైనా వెనుకాడము అనే వ్యూహంతో వైసీపీ ముందుకు రావడం ఖాయంగా కనపడుతుంది.

ADVERTISEMENT

2019 ఎన్నికలలో భీమవరం లో జరిగిన త్రిముఖ పోటీలో పవన్ వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ పై స్వల్ప మెజారిటీతో ఓటమి చెందిన విషయం తెలిసింది. అయితే ఆ సమయంలో టీడీపీ తరుపున బరిలో ఉన్న రామాంజనేయులు టీడీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో రామాంజనేయులు మాట్లాడుతూ…,రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ చేసిన త్యాగాన్ని, వైసీపీ నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తాను తగ్గి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను గెలిపించడానికి పవన్ చూపిన చొరవను కొనియాడారు.

అలాగే పనిలోపనిగా భీమవరం నుండి పోటీ చేయబోయేది పవనే అంటూ రాష్ట్ర ప్రజలకు ముందుగా ప్రకటించింది ఈ మాజీ టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులే. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన ఈ రామాంజనేయులు 54036 ఓట్లను సాధించారు. జనసేన నుంచి పవన్ కు వచ్చిన ఓట్లు 62285 . ప్రస్తుత ఎమ్మెల్యే గా ఉన్న వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ 70642 ఓట్లు సాధించి దాదాపు 8000 వేల ఓట్ల తేడాతో పవన్ పై విజయం సాధించారు.

2024 లో జరగబోయే ఎన్నికలలో వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత, గ్రంధి మీద ఉన్న ఆరోపణలు, ఇటువంటి వాడిని గెలిపించుకోలేక పోయామే అన్న పవన్ మీద ఉన్న సింపతీ కి తోడు ఇప్పుడు టీడీపీ తో పొత్తుకారణం గా టీడీపీ ఓటు బ్యాంకు కూడా జనసేనకు యాడ్ అవ్వడంతో గణాంకాల దృష్ట్యా చూసిన, సెంటిమెంట్ దృష్ట్యా చూసిన ఈసారి పవన్ విజయం దాదాపు ఖరారైనట్లే. అలాని వైసీపీ ని తక్కువ అంచనా వేసి టీడీపీ – జనసేనలు భీమవరం పై నిర్లక్ష్యం వహిస్తే పవన్ మరోసారి ఓటమి తాలూకా బాధను అవమానాన్ని ఎదుర్కోకతప్పదు.

ఎవరెన్ని కోట్లు ఖర్చుచేసినా, వైసీపీ ఎన్ని వ్యూహాలు పన్నినా, ఈసారి భీమవరం జనసేనదే అంటూ పార్టీ క్యాడర్లో ఒక నమ్మకాన్ని, భరోసాని, ఉతేజాన్ని నింపిన పవన్ రాజకీయాలలో బంధుత్వం ఉండదు…యుద్ధమే ఉంటుంది. యుద్ధములో దిగిన తరువాత నావాళ్లు… నీవాళ్ళు కాదు ప్రత్యర్థి వర్గమా…నా వర్గమా రెండే ఉండాలి. సొంత అన్నను కాదని, ఆయనను బాధపెట్టి రాజకీయాలలోకి వచ్చాను అంటూ గత ఎన్నికలలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

భీమవరంలో ఎమ్మెల్యే గా ఓడిపోయిన ఒక వ్యక్తి మూడు పార్టీలను కలపడంలో కీలక పాత్ర పోషించాడు అంటే అది మీరు నా పై చూపించిన అభిమాన బలమే అంటూ తన అభిమానులను కూడా ఖుషి చేసారు పవన్. భీమవరం నుండి నేను ఎక్కడికి వెళ్లిపోవడం లేదనే ఒక క్లారిటీ జనసైనికులకు రావడంతో స్థానిక జనసేన క్యాడర్ ఆనందంలో ఊగిపోతున్నారు. పవన్ ప్రకటించిన ఈ నిర్ణయం అటు గోదావరి జిల్లాలో కూటమి గెలుపుని ప్రభావితం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories