తానేదో అమాయకుడిలా మాట్లాడుతున్నాడే పవన్!

Pawan Kalyan comments Amaravati landpolingఏపీ అభివృద్ధికి సహకరిస్తుందేమోనని నాలుగేళ్ళు వేచి చూసిన తర్వాత బిజెపి నుండి టిడిపి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిని విశ్వసించని పవన్… బిజెపి చేతిలో టిడిపి మోసపోయిందంటే నమ్మగలమా? ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆడుతోన్న డ్రామా అంటూ తెగ విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదే సూత్రం తనకు వర్తిస్తుందని మాత్రం మరిచిపోతున్నట్లున్నారు పవన్.

[m9ad]

ADVERTISEMENT

నాలుగేళ్ల పాటు టిడిపికి మద్దతు పలికిన తర్వాత… బిజెపి నుండి ఎప్పుడైతే టిడిపి బయటకు వచ్చిందో… అప్పుడు విమర్శలు ప్రారంభించిన జనసేన అధినేతకు కూడా… అదే సూత్రం వర్తిస్తుంది కదా?! ముఖ్యంగా రాజధాని కోసం ప్రజలు భూములు సమర్పించడంపై పవన్ తనకేమీ తెలియదన్నట్లు మాట్లాడడం విస్తుగోలిపే అంశం. ఓ రకంగా అమరావతి బ్రాండ్ నేమ్ ను తగ్గించడానికి పవన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనపడుతోంది.

నాడు రాజధానిని కేవలం 1850 ఎకరాల్లోనే నిర్మిస్తానని తనకు చెప్పారని, ఇంకా ఏమైనా అవసరమైతే అటవీ ప్రాంత భూములను వినియోగిస్తామని తెలిపారని, అందుకే తాను మద్దతు ఇచ్చానని, ఇందులో తన తప్పేమీ లేదు, అసలు తనకేమీ తెలియదు అన్న అమాయకుడు మాదిరి పవన్ వ్యాఖ్యలు చేస్తుండడం విశేషం. పవన్ చెప్పింది నిజమో, అబద్ధమో పక్కన పెడితే, రాజధాని కోసం సేకరించిన 33 వేల ఎకరాలు రహస్యంగా జరిగిందా?

1850 ఎకరాలు కాదు, 33 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తున్న సమయంలోనే బయటకు వచ్చి, ఇంత భూమి అవసరం లేదని పవన్ ఎందుకు చెప్పలేదు? తీరా ఇప్పుడు 90 శాతంకు పైగా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి రాద్ధాంతం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? కేవలం రాజకీయ లబ్ది తప్ప! పవన్ కు నిజంగా భూముల పట్ల, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆనాడే వస్తే అందరి నుండి మద్దతు లభించి ఉండేది.

కానీ నేడు చేస్తోన్న రాద్ధాంతం వలన అమరావతిలో భూముల విలువ నానాటికి పడిపోతోందని అదే రైతులు గగ్గోలు పెడుతున్నారు. పవన్ చేసే రైతు అనుకూలత ఇదేనా? రాష్ట్రంలో “మరో జగన్”లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మారుతూ, అభివృద్ధికి అడ్డం పడే ప్రక్రియలు చేస్తుండడం ఏ మాత్రం ఊహించినది కాదు. అప్పుడు ఏ విషయం మీడియా అడిగినా… ఇంకా టైం ఉంది… అంటూ చెప్పుకొచ్చిన పవన్, ఇప్పుడు చేజారిపోయిన తర్వాత విమర్శలు చేసి ఏం ప్రయోజనం?! అంతా “ఆపరేషన్ డైవర్షన్” తప్ప!

ADVERTISEMENT
Latest Stories