అప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్లారు…ఇప్పుడు జర్మనీ వెళ్లమంటున్నారు…!

Pawan Kalyan Comments on Jagan Reddy's Opposition Status

ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వచ్చేది లేదు, ఒకవేళ వచ్చినా సభలో ఉండేది లేదు అంటూ మొంకిపట్టు పట్టి అసెంబ్లీ నుంచి వాక్ అవుట్ చేసిన వైసీపీ కి నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి కౌంటర్ ఇచ్చారు.

ఈ ఐదేళ్లు వైసీపీ నేతలు ఎంత గగ్గోలు పెట్టినా వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా, జగన్ కు ప్రతిపక్ష నాయకుడి గౌరవం దక్కదని ఖరాకండిగా తెగేసి చెప్పేసారు పవన్. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతోనే, ప్రభుత్వం నిర్ణయంతోనో వచ్చేది కాదని, వైసీపీకి ప్రజలే ఆ ప్రతిపక్ష హోదా ను తొలగించారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ నేతలు నడుచుకుంటే మంచిదన్నారు.

ADVERTISEMENT

వచ్చిన సీట్ల శాతాన్ని బెట్టే పార్టీలకు ప్రతిపక్ష హోదా ఉంటుంది కానీ జగన్ కోరుకుతున్నట్టుగా పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా భారత రాజ్యంగంలో ప్రతిపక్ష హోదా రాదన్నారు. ఒకేవేళ వైసీపీ నేతలు చేస్తున్న విదితండవాదన ప్రకారం హోదా కావాలంటే ఇక వైసీపీ నేతలంతా జర్మనీ వెళ్లి రాజకీయాలు చేసుకోవాలంటూ కౌంటర్ వేశారు పవన్.

జగన్ చెప్పే నియమాలు, వైసీపీ అడుగుతున్న హోదాలు జర్మనీ రాజకీయాలలో కనిపిస్తున్నాయి. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం అక్కడ ఆపార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుని ప్రతిపక్ష హోదా కల్పిస్తారు. కాబట్టి జగన్ జర్మనీ లో రాజకీయాలు చేసుకోవచ్చు అంటూ పవన్ ఇచ్చిన కౌంటర్ కి మరో వాదన జోడించి వైసీపీకి సూచనలు చేస్తున్నారు కూటమి మద్దతుదారులు.

జగన్ తన పాలనలో సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రకటించి ఐదేళ్ల పాటు ఏపీతో మూడుముక్కలాట ఆడారు. రాజధానుల మార్పుతో రాష్ట్ర వినాశనానికి సౌత్ ఆఫ్రికాను సాక్షిగా చూపిన జగన్ ఇప్పుడు జర్మనీ రాజ్యాంగాన్ని ఏపీలో అమలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా విధానాలతో ముందుకెళ్లిన జగన్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం జర్మనీ వెళ్లాలనుకుంటున్నారా.? అంటూ జనసేన నేతలు వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు. అయితే పవన్ మాత్రం వైసీపీ నేతల మాదిరి బూతులతోనో, అసభ్య పదజాలంతోనే కాకుండా మెత్తని మాటలతోనే వైసీపీ నేతల నినాదాలకు కౌంటర్ ఇచ్చారు.

దీనితో జగనన్న లోకల్ కాదు ఇంటర్ నేషనల్ రాజకీయాలలో సిద్దహస్తుడనుకుంటా అంటూ వైసీపీ పై సెటైర్లు పేలుతున్నాయి. అయితే గత ఐదేళ్లు మూడు రాజధానుల కోసం ముఖ్యమంత్రిగా సౌత్ ఆఫ్రికా కు వెళ్లిన జగన్ ఈ ఐదేళ్లు ప్రతిపక్ష హోదా కోసం జర్మనీ వెళ్లాల్సిందేనా.? అప్పుడు ఆయన వెళ్లారు..ఇప్పుడు వీళ్ళు వెళ్లమంటున్నారు. మరి వైసీపీ ఈ ఐదేళ్లు జర్మనీ విధానాల కోసం ఏపీలో పోరాటం చేస్తూనే ఉంటుందా.

ADVERTISEMENT
Latest Stories