అందరూ అన్ని మానేసి వస్తారు సరే ఇంతకీ మీరేం చేస్తారు పవన్ కళ్యాణ్?

pawan kalyan comments on vizag railway zoneవిశాఖ రైల్వే జోన్‌ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఆయన పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఈ పోరాటానికి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి కూడా రావాలన్నారు. ముగ్గురం కలిసి విశాఖలో రైళ్లను స్తంభింపజేసి ఉద్యమిద్దామని, అప్పుడు కేంద్రం దిగిరాక తప్పదని చెప్పారు.

విశాఖ రైల్వే జోన్ తదితర కేంద్ర సంబంధిత విషయాలపై జనసేన స్పందన సరిగ్గా లేదన్న ఆరోపణపై పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించారు. ఆ విషయాలపై ఇప్పటికే తెలుగు దేశం, వైఎస్సాఆర్ కాంగ్రెస్ తమకు తోచిన విధంగా పోరాటాలు చేస్తున్నారు. అయితే జనసేన ఏమీ చేయ్యకపోగా మీరు వస్తే చేద్దాం రండి అండం ఏంటో?

ADVERTISEMENT

కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిని ఎదిరించేందుకు తను ముందుకొస్తుండగా ఎక్కువ మంది ఎంపీలున్న చంద్రబాబు మోదీని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముందుకు వచ్చారో? రైళ్లు ఆపడానికి పవన్ కళ్యాణ్ మరియు ఆయనకు మద్దత్తు ఇస్తున్న వామపక్షాల శక్తి చాలదా? మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు వస్తే చేద్దాం అనడం ఏంటో?

ADVERTISEMENT
Latest Stories