తమ పార్టీకే గనుక 10 మంది ఎంపీలు ఉండి ఉంటే అసెంబ్లీలో నిలబడేవాడినని, వైకాపాలా పారిపోయేవాడిని కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అయితే ఎంపీలు ఉంటే అసెంబ్లీని ఆపడం ఏంటని కాసేపు అక్కడున్న వాళ్ళకు అర్ధం కాలేదు. పవన్ కళ్యాణ్ వైకాపా ఎంపీ రాజీనామాలను తప్పు పడుతున్నాడా లేక అసెంబ్లీకి రాకపోవడాన్ని తప్పు పడుతున్నాడా వారికి అర్ధం కాలేదు.
తాను భాజపాను ఏమీ అనడం లేదని సీఎం చంద్రబాబు అనడంపై పవన్ మండిపడ్డారు. నాలుగేళ్ల పాటు తెదేపా గురించి ఏమీ మాట్లాడనప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని ఎదురు ప్రశ్నించారు. నిజమే 75000 కోట్లు పైగా కేంద్రం ఇవ్వాలని తేల్చింది ఆయన ఏర్పాటు చేసిన కమిటీనే. మరి కేంద్రాన్ని ఎందుకు విమర్శించడం లేదు?
అదే విధంగా టీడీపీని ఎందుకు విమర్శించలేదని టీడీపీ ఎందుకు అడుగుతుంది? పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలు అన్నీ నిజమే అయితే అవును ఎందుకు టీడీపీ ప్రభుత్వాన్ని నాలుగేళ్ళ పాటు విమర్శించలేదు. ఆ ప్రశ్నకు కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి కదా?



