
ఓజీ.. ఏం జరుగుతోంది?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ సోకడంతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చేరారు. ఆయనకు వైద్యులు కొన్ని పరీక్షలు చేసి చికిత్స చేస్తున్నారు. ఇంకా మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారని జనసేన సోషల్ మీడియాలో తెలియజేస్తూ రెండు ఫోటోలు పెట్టింది.
Also Read – మంచు ఫ్యామిలీ వార్: ఇక్కడ కూడానా…?
అయితే రేపటి నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నందున మిగిలిన వైద్య పరీక్షలు తర్వాత చేయించుకుంటారని తెలియజేసింది. పవన్ కళ్యాణ్ రేపటి నుంచే శాసనసభ సమావేశాలకు హాజరావుతారని జనసేన తెలియజేసింది.
సిఎం చంద్రబాబు నాయుడుతో పోలిస్తే డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వయసులో చిన్నవారు. కానీ తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు చాలా చురుకుగా అటు ప్రభుత్వం, ఇటు పార్టీ వ్యవహారాలు చక్కబెడుతుంటారు.
Also Read – పోసాని కి దక్కని జగన్ ఓదార్పు…వై.?
వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉండే ఢిల్లీకి తరచూ వెళ్ళి వస్తుంటారు. సిఎం చంద్రబాబు నాయుడు 74 ఏళ్ళ వయసులో కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా, ఇంత చురుకుగా ఉంటే, ఆయన కంటే వయసులో చాలా చిన్నవారైన పవన్ కళ్యాణ్ తరచూ అనారోగ్యం పాలవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నప్పుడు, ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించినప్పుడు ఎంతగా శ్రమించేవారో అందరికీ తెలుసు.
Also Read – కేసీఆర్, జగన్: దొందూ దొందే…
నాడు ఎన్నడూ అనారోగ్యం పాలవని పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. కనుక ఆయన అవసరానికి మించి రాజకీయ, పని ఒత్తిళ్ళు భరిస్తున్నారా లేక ఆ కారణంగా ఆరోగ్యంపై శ్రద్ద వహించడం తగ్గిందా? అనే సందేహం కలుగుతోంది.
పవన్ కళ్యాణ్ ఇటీవల అస్వస్థతకు గురై తేరుకోగానే కొడుకు అఖిరా నందన్‌ని వెంటబెట్టుకొని కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో తీర్ధ యాత్రలు చేసి వచ్చారు. ఆ తర్వాత వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళి హైదరాబాద్ తిరిగి రాగానే మళ్ళీ అస్వస్థతకు గురయ్యారు.
పవన్ కళ్యాణ్ ఎంతగానో శ్రమించి, ఎన్నో సమస్యలు, సవాళ్ళు, అవమానాలు భరించి ఎదుర్కొన్న తర్వాత రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాగలిగారు. కనుక ఉప ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడుగా కీలక బాధ్యతలు నిర్వరిస్తున్న పవన్ కళ్యాణ్ తరచూ ఇలా అనారోగ్యానికి గురవుతుండటం మంచిది కాదు.
కనుక రాజకీయాలలో, పాలనలోనే కాకుండా ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలనే విషయంలో కూడా సిఎం చంద్రబాబు నాయుడు సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదేమో?