కాకినాడ సభలో జరిగిన తొక్కిసలాటలో వెంకటరమణ అనే యువకుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ, భద్రతా కారణాల రీత్యా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వలన ఆసుపత్రికి రాలేకపోయానని ఒక లేఖ విడుదల చేసిన పవన్ కళ్యాణ్, తాజాగా సదరు అభిమాని ఇంటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.
చేతికి వచ్చిన కొడుకు చేజారిపోతే, ఆ గర్భశోకం ఎలా ఉంటుందో తానూ అర్ధం చేసుకోగలనని లేఖలో తెలిపిన పవన్ కళ్యాణ్, తాజాగా ఆ అభిమాని కుటుంబానికి వెళ్లి తానూ అండగా ఉంటానని మనోధైర్యం చెప్పే ప్రయత్నం చేయనున్నారు. కాజులూరు మండలంలోని కుయ్యూరు గ్రామానికి చెందిన వెంకట రమణ ఇంటికి పవన్ వెళ్తారని ముందుగా ఊహించిన పరిణామమే. దీంతో వరుసగా మూడో రోజు కూడా పవన్ తూర్పు గోదావరి జిల్లాలోనే ఉండనున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



