చంద్రబాబు నాయుడే టార్గెట్ గా పనిచేస్తోన్న జనసేన అధినేత నోట ఆదివారం నాడు పలు కీలక విషయాలు వచ్చాయి. 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఉంటే, రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చారని, అయితే ఆ మరుసటి రోజే రెండు పేపర్లకు లీకులు ఇచ్చారని, దీంతో చంద్రబాబుపై నమ్మకం ఆ రోజే పోయిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాతే ప్రధాని నరేంద్ర మోడీని కలిసానని స్వయంగా పవన్ చెప్పడంతో మొత్తం స్కెచ్ అంతా ప్రజలకు స్పష్టమవుతోంది.
నాలుగేళ్ల క్రితమే చంద్రబాబుపై పవన్ కు నమ్మకం పోతే, మరి ఈ నాలుగేళ్ళు ఏం చేస్తున్నట్లు? బిజెపి మోసం చేస్తుంటే టిడిపి నాలుగేళ్ళు ఏం చేసిందని ప్రశ్నిస్తున్న పవన్, మరి ఈ నాలుగేళ్ళు టిడిపి మోసం చేస్తుంటే ఏం చేసారో సెలవిస్తే బాగుండేది. ఇందులో మరో విషయం ఏమిటంటే… ముందే పేపర్లో సమాచారం వచ్చిందని పవన్ కు నమ్మకం పోయింది, ఒకవేళ ఆ అంశం పేపర్లో రాని పక్షంలో… రాజ్యసభ సీటును తీసుకునేవారా? రోజురోజుకు పవన్ స్పీచ్ లు మరింత కామెడీగా మారిపోతున్నాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే!



