జగన్ దగ్గరకు వెళ్లి జనసేనకు ఓటు వేశా అని చెప్పగలవా?

Pawan - Kalyan - JanaSenaపవన్ కళ్యాణ్ గత నాలుగు రోజులుగా మంగళగిరి ఆఫీసులో పార్టీ ఎన్నికల ఘోరపరాజయంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిన్న ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొందరి యువకులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ… ఇక్కడ ఉన్న వాళ్లలో 60% మంది నాకు ఓటు వెయ్యలేదు అంటూ ఒక యువకుడిని నువ్వు జనసేనకు ఓటు వేసావా అని అడిగారు. అతను వెంటనే లేదు సార్ నేను వైఎస్సార్ కాంగ్రెస్ కు వేసా అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ADVERTISEMENT

“మరి..మీరే నన్ను నమ్మక పోతే..ఇంక నన్ను ఎవరు నమ్ముతారు. ఇదే మాట జగన్ దగ్గరకు వెళ్ళి నేను మీకు ఓటు వేయలేదు..జనసేన కు వేశానని చెప్పగలవా?,” అన్నారు పవన్ కళ్యాణ్. అతను నీళ్లు నములుతుండగా, “నువ్వు ధైర్యంగా చెప్పావ్ నిన్ను నేను అభినందిస్తున్నా,” అని ఆయన అన్నారు. “నువ్వు నాకు వోట్ వేసి నాకు సలహాలు ఇవ్వు అంతే కాని నాకు వోట్ వేయకుండా నా పార్టీ ని ఎలా నడపాలో నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావ్,” అన్నారు జనసేనాని.

లేదు సార్ వేస్తాను అని కుర్రోడు ఏదో చెప్పబోతుండగా “లేదమ్మా నీకు నాకు ఓటు వేసే శక్తి లేనప్పుడు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అని పవన్ కళ్యాణ్ సున్నితంగా చెప్పారు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో జనసేన కేవలం ఒక్కే ఒక్క సీటు తన ఖాతాను తెరిచింది. తన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన తో పాటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు.

ADVERTISEMENT
Latest Stories