కొద్ది రోజుల క్రితం వామపక్షాలతో కలిసి వెళతామని సంకేతాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ మాట మార్చినట్టున్నారు. జనసేన మళ్లీ అన్ని స్థానాలకు పోటీచేస్తానని అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా కమ్యూనిస్టులకు రుచించవనే చెప్పాలి. గతసారి సమస్యలను అర్దం చేసుకోవడం కోసమే ఎన్నికలలో పోటీచేయలేదని ఆయన అన్నారు.
రాజకీయాలలో లబ్ది పొదాలనుకుంటే అప్పుడే బిజెపి, టిడిపిలతో బేరాలు చేసి ఉండేవాడినని ఆయన అన్నారు.కాని విలువ కోసం అలా చేయలేదని అన్నారు. రాజకీయాలలోకి రాగానే పదవి కోరుకోలేదని, సమస్యల పరిష్కారం కోరుకున్నానని అన్నారు. తనకు చాలా ఒపిక ఎక్కువ అని, ఎంత ఓపిక అంటే ఒక సినిమా హిట్ కోసం పన్నెండేళ్లు వెయిట్ చేశానని ఆయన అన్నారు.
వామపక్షాల వీధి పోరాటాలలో నిష్ణాతులు. ఆ అనుభవాన్ని జనసేన వాడుకోవాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. అయితే వామపక్షాలు తమకు ఉపయోగపడాలి కానీ మేము వారికి ఉపయోగపడము అంటే అలా కుదిరే పరిస్థితి లేదనే చెప్పాలి. ఈ ప్రకటనతో వామపక్షాలు తమ దారి తాము చూసుకుంటాయా?



