సెప్టెంబరు మొదటి వారంలో హైదరాబాద్లో భారీ బహిరంగసభకు సిద్ధమవుతుంది జనసేన పార్టీ. ఆ సభలో ఆ పార్టీ తెలంగాణ పొత్తుల విషయంలో క్లారిటీ ఇవ్వబోతుంది. తెలంగాణలో జనసేనతో కలిసి పనిచేయడానికి పలు పార్టీలు సంసిద్దత వ్యక్తం చేశాయని స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.
[m9ad]
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అన్ని స్థానాలలో పోటీచేయడానికి కార్యకర్తలను సమాయత్తం చేయాలని ఆయన అన్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణకు, కమిటీల ఏర్పాటుకు చర్య తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన వెంటనే దాని బాధ్యులు.. జిల్లా కమిటీల నియామకాన్ని వెనువెంటనే ప్రారంభించి, మొత్తం ప్రక్రియను రెండు, మూడు వారాల్లోనే పూర్తి చేస్తారని చెప్పారు.
అయితే జనసేన తెలంగాణాలో అధికార పక్షానికి అనుకూలమని, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సెట్లర్ల ప్రాభల్యం ఎక్కువగా ఉండే చోట్ల పోటీ చేసి తెరాసకు మేలు చెయ్యాలని చూస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్ లో సభ పెట్టడం కూడా అదే సూచిస్తుందని వారు అంటున్నారు.



