పవన్ వస్తున్నారుగా… పేరు మారింది..!

Pawan Kalyan Meeting Gunturఈ నెల 20న గుంటూరు జిల్లాలో జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ పాల్గొనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ముందుగా ‘పద్మశాలి గర్జన’ పేరుతో నిర్వహిస్తామని సభ నిర్వహకులు చెప్పగా, పవన్ కళ్యాణ్ వస్తానని హామీ ఇవ్వడానికి తోడు, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తానని స్వచ్ఛందంగా ముందుకు రావడంతో సభ పేరును ‘చేనేత గర్జన’ అంటూ మార్చారు.

‘పద్మశాలి గర్జన’ అనేది ఒక కులాన్ని ప్రతిబింభించేదిగా ఉండడంతో, పవన్ వస్తుండడంతో పేరు మార్చక తప్పని పరిస్థితి నెలకొంది. 18 కులాల అనుబంధంగా నడుస్తున్న ఈ సభకు ‘చేనేత సభ’ అని పేరు పెట్టడమే సరైనదని నిర్వాహకులు తెలిపారు. ఈ సభకు 80,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని, సభ విజయవంతమవుతుందని, ఆదివారం సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తవుతాయని తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories