2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న విపక్షనేత జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. ఆయన ఇప్పటికే పని మొదలెట్టేసాడు కూడా. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా తన జనసేన పార్టీ కోసం ఒక రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నారు.
జనసేన పార్టీ వ్యూహకర్తగా దేవ్‌ని నియమించారు. 13జిల్లాల ప్రతినిధులకు దేవ్‌ని పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. గత పదినెలలుగా పార్టీ కార్యక్రమాల రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన కార్యకర్తలకు తెలిపారు. గతంలో తను స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు సంబంధించిన 1200 మంది కార్యకర్తలు దేవ్ టీమ్‌కు సహకరిస్తారన్నారు.
రానున్న కొద్దీ నెలల్లో పవన్ కళ్యాణ్ చేసే ప్రచారం సరళిని ఆయనే రూపొందిస్తారు. అలాగే అన్ని నియోజకవర్గాలలో సర్వేలు చేసి పార్టీకి అనుకూలమైన అభ్యర్థులను పవన్ కళ్యాణ్ కు సిఫార్సు చేస్తారు. తొందర్లో ఆ పని పూర్తి చేసి అభ్యర్థులకు నియోజకవర్గాలలో పని చేసుకోవడానికి తగిన టైం ఇవ్వాలని పవన్ అభిప్రాయమట.



