కేంద్రానికి వ్యతిరేకంగా జనసేన పోరాటం చేయ్యడం లేదు అని వస్తున్న విమర్శలకు పవన్ కళ్యాణ్ స్పందించారు. “2014 లో విశాఖ రైల్వే జోన్ అంటే మీ ఎంపీలు రాయపాటి, గల్లా జయదేవ్ లు అడ్డుపడ్డారు, మళ్ళీ ఈరోజు పొద్దున కూర్చొని విశాఖలో డ్రామాలు చేస్తోందే కాక మళ్ళీ మీ డ్రామాలకు నన్ను జనసేనను మద్దతు ఇవ్వమని అడిగితే నేను ఇవ్వను,” అని ఆయన అన్నారు.
అప్పట్లో ఒకసారి రాయపాటి గుంతకల్ లో రైల్వే జోన్ కావాలి అని మీడియా ముఖంగా అడిగిన మాట వాస్తవమే అయినా దానికి తెలుగుదేశం పార్టీ నుండే మద్దత్తు రాలేదు. అయినా రాయపాటి, గల్లా అడ్డుకోవడానికి కేంద్రం ఎప్పుడు జోన్ ఇచ్చే ప్రయత్నం చేయ్యలేదు. సరే పవన్ కళ్యాణ్ ఆరోపణ నిజమే అనుకుందాం.
తెలుగుదేశం వారి దీక్షలో నిజాయితీ లేకపోతే పవన్ కళ్యాణ్ స్వయంగా దీక్షకు దిగాల్సింది. జనసేన స్వయంగా తన సొంత కార్యాచరణ ప్రకటించాల్సింది. టీడీపీ వారికి నిబద్దత లేకపోతే అసలు ఆ అంశాలనే పట్టించుకోనక్కర్లేదని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? ఈ వ్యూహం గొప్పదని ఆయన ఎందుకు భావిస్తున్నారో?



