పవన్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan satire on nandamuri balakrishnaతెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు. తన అభిమానులు చేసిన రాద్ధాంతాన్ని సమర్ధిస్తూ పరోక్షంగా నందమూరి నటసింహం బాలకృష్ణపై వ్యాఖ్యలు చేసారు. ఇటీవల జరిగిన ఓ ర్యాలీలో పవన్ అభిమానులు బైక్ సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యంతో వీరంగం సృష్టించారు.

[m9ad]

ADVERTISEMENT

దీన్ని సీరియస్ గా పరిగణించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేయగా, తాజాగా ఆ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు చేసిన దాంట్లో తప్పేముందన్నట్లుగా వ్యాఖ్యానించారు. అంతేకాక జనసైనికుల సంస్కారం చాలా గొప్పదని వాటిని మరింత సమర్ధించే ప్రయత్నం చేసారు పవన్. భీమవరంలో ఆక్వా రైతులతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసారు.

ఇంట్లో తుపాకీతో కాల్చిన వారు ఇప్పుడు బయట తిరుగుతున్నారని, వాళ్ళని పోలీసులు పట్టించుకోవడం లేదని, పరోక్షంగా నాటి బాలకృష్ణ – బెల్లంకొండల అంశాన్ని ప్రస్తావించారు పవన్. నేరుగా ఈ విషయాన్ని ప్రస్తావించే ధైర్యం చేయలేదు గానీ, దీనిపై టిడిపి వర్గాలు మాత్రం పవన్ పై మండిపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories