పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణుదేశాయ్ ల ఇరువురి (కొడుకు, కూతురు) సంతానం ప్రస్తుతం తల్లి వద్దే చదువుకుంటున్న విషయం తెలిసిందే. పిల్లల సంక్షేమాలు చూసుకుంటున్న పవన్ కళ్యాణ్, వారికి అవసరమైన సమయంలో మాత్రం అందుబాటులో ఉంటున్నారు. ఇదిలా ఉంటే, రేణు దగ్గర ఉంటున్న కొడుకు అకిరాకు సైకిల్ యాక్సిడెంట్ జరిగినట్లుగా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.
సైకిల్ యాక్సిడెంట్ జరగగానే ఉన్నతమైన వైద్య చికిత్స నిమిత్తం బెస్ట్ హాస్పిటల్ కు తీసుకువెళ్ళానని, అయితే దెబ్బలు తగిలిన పిల్లవాడికి వెంటనే చికిత్స చేయకుండా సాగదీస్తూ, వేచిచూసేలా చేయడం, సెన్స్ లేకుండా ప్రవర్తించడం జరిగిందని తన మనోవేదనను వెల్లడించింది. పెద్ద హాస్పిటల్స్ కోసం చికిత్సకు వెళ్ళే బదులు చనిపోవడం మేలని, డాక్టర్ల నుండి నర్సుల వరకు ఉన్న సెన్స్ లెస్ సిస్టం మొత్తం మానవ సంబంధాలనే చంపే విధంగా ఉందని మండిపడ్డారు రేణు.
పేరుగాంచిన పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులలో ప్రస్తుతం వైద్యం అలా జరుగుతున్న విషయం తెలియనిది కాదు. అయితే సామాన్యుడి ఆవేదన మీడియా వరకు రాదు గనుక, ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూడవు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న రేణుదేశాయ్ వంటి వారికే ఇలాంటి అనుభూతులు ఎదురవుతుంటే… ఇక సామాన్యుడిని పట్టించుకునే నాధుడు ఎవరు అనుకోవడంలో తప్పులేదులే… బహుశా అందుకేనేమో ఏకంగా ఈ “సిస్టం” పైనే రేణు గురిపెట్టి విమర్శలు గుప్పించారు.
He has a hand fracture, lots of face, knee, shoulder and elbow wounds. But he is okay now. Thank you sincerely for all the wishes for him 🙂
— renu (@renuudesai) May 9, 2016
Akira had bad cycle accident,got him to one of d best hospitals&inspite of seeing an injuredchild d delay in treatmnt&waiting&insensitivity
— renu (@renuudesai) May 9, 2016
Rather, directly die,than go to big hospitals for treatments!The insensitivity of the entire system frm docs to nurses kills d human spirit!
— renu (@renuudesai) May 9, 2016



