
ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆయన భార్య అన్నా లెజ్‌నోవా, పిల్లలు సింగపూర్‌లో ఉంటున్నారు. వారి పిల్లలు అక్కడే పిల్లలు చదువుకుంటున్నారు.
Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…
వారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్ళు చేతులకు స్వల్పగాయాలయ్యాయి. ఊపిరి తిత్తులలోకి పొగ వెళ్ళింది. స్కూలు సిబ్బంది వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు అరకులో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. కానీ కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో పవన్ కళ్యాణ్ తన పర్యటన వాయిదా వేసుకొని విశాఖపట్నం విమానాశ్రయం నుంచే నేరుగా సింగపూర్ బయలుదేరుతున్నారు.
Also Read – వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్‌ట్రా ప్లేయర్?