జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న అవిశ్వాసతీర్మాణం పెట్టినది మొదలు టీడీపీని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే టైములో బీజేపీపై మెతక వైఖరి చూబిస్తున్నారు. ఈరోజు ఆయన ట్విట్టర్ లో తమకు బీజేపీ తో ఎలాంటి సంబందం లేదు అంటూ టీడీపీ ఎంపీల పై చిత్రమైన ఆరోపణ ఒకటి చేశారు.
“నిన్న ప్రధాన మంత్రి మోదీగారి కాళ్లకి మీ టీడీపీ ఎంపీలు పాధాభివందనం చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. అదే సభలో ఓవైపు మీ ఎంపీలు బీజేపీని తిడతారు. ఇంకోవైపు బీజేపీ కాళ్లకు మొక్కుతారు. దీన్ని మేం ఎలా అర్థం చేసుకోవాలి?” అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నిజానికి అటువంటిది ఏది జరిగినట్టు లేదు.
సభలో జయదేవ్ మోడీ మోసగాడని అనడం అందరూ చూసారు. కేశినేని నాని అయితే మోడీ ప్రపంచంలోనే ఉత్తమ నటుడు అని ఏకి పారేశారు. మోడీ ప్రసంగానికి అడుగడుగునా అడ్డుపడ్డారు నినాదాలతో. ఇంకా పవన్ కళ్యాణ్ కు అనుమానాలు ఏంటో? ఒకవేళ టీడీపీ ఎంపీలు ఎవరైనా మోడీ కి నమస్కారం చేసినా మొన్న ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మోడీకి ఎందుకు నమస్కారం చేసినట్టో.



